Rahul Dravid Controversial Comments On Bowlers | BCCI | ICC

Rahul dravid controversial comments on bowlers new cricketers bcci icc

Rahul Dravid news, Rahul Dravid controversy, Rahul Dravid comments, Rahul Dravid press meet, Rahul Dravid updates, Rahul Dravid gallery, Rahul Dravid, Indian Bowlers, Pace Bowlers, New Cricketers, IPL 8 Season

Rahul Dravid Controversial Comments On Bowlers New Cricketers BCCI ICC : Indian Former Cricketers Rahul Dravid Makes Controversial Comments On Bowlers. He Told That Ban Must On Those Bowlers Who Are Not Following The Rules.

‘ఆ బౌలర్ల వల్లే యువక్రికెటర్లు నాశనం అవుతున్నారు’

Posted: 05/01/2015 10:34 AM IST
Rahul dravid controversial comments on bowlers new cricketers bcci icc

వివాదాలకు దూరంగా వుండే మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్.. గతంలో ఎన్నడూలేని విధంగా తాజాగా తన అభిప్రాయాలను వెల్లడించి సంచలనం సృష్టించాడు. నేటి యువక్రికెటర్లకు మద్దతుగా తనమేరకు కృషి చేసేందుకు ముందుకొచ్చిన ఈ క్రికెటర్.. కొందరి బౌలర్ల వల్ల వారి జీవితాలు నాశనమవుతున్నాయని వ్యాఖ్యానించాడు. దీంతో ఈ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇతని వ్యాఖ్యలకు బీసీసీఐ, ఐసీసీ మద్దతు పలకడం విశేషం! ఇంతకీ రాహుల్ ఎవరిని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు..? అనేగా సందేహం! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ఇటీవలేకాలంలో బౌలర్లు తమ ప్రతిభ కనబరిచేందుకు విచ్చలవిడిగా బౌలింగ్ వేస్తూ బ్యాట్స్ మెన్లను ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యంగా బౌన్స్ బాల్స్ వేయడంతో ఆటగాళ్లు వాటిని ఆడలేకపోవడంతోపాటు భయబ్రాంతులకు గురవుతున్నారు. అటువంటి బంతులు ఎక్కడ తమ తలకు తగిలి తాము కూడా ఫిలిప్ హ్యాస్ లాగే కుప్పకూలాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలో మునిగిపోయారు. అలా బౌన్స్ వేసే బౌలర్ల మీద విమర్శలు, హెచ్చరికలు వచ్చినప్పటికీ వారు మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా బ్యాట్స్ మెన్లపై తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో యువక్రికెటర్లు కాస్త భయాందోళనకు గురవుతున్నారు. ఇటువంటి బౌలర్ల వల్ల యువక్రికెటర్ల కెరీర్ నాశనమవుతోందని ద్రావిడ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

నిబంధనలు పాటించకుండా బౌలింగ్ చేస్తున్న వారి కారణంగా ఎంతోమంది యువక్రికెటర్ల కెరీర్ నాశనం అవుతోందని ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. ఇటువంటి బౌలర్లపై నిషేధం విధించే దిశగా బీసీసీఐ, ఐసీసీ తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన సమర్థించాడు. సునీల్ నరైన్ వేసే ఆఫ్ స్పిన్ బంతులపై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే! ఇదే విషయంపై ఆయన స్పందించాలని మీడియా కోరగా.. తాను ఎవరి పేర్లనూ వ్యక్తిగతంగా చెప్పనని, అయితే నియమావళిని అతిక్రమించి బౌలింగ్ చేసే వారిని పక్కన పెట్టడమే మంచిదని అన్నారు. దీంతో.. కొత్తతరం క్రికెటర్లు సరైన దిశలో నడిచే అలవాటును ముందునుంచే నేర్చుకుంటారని అన్నాడు.

ఇక ఇటీవలే రాజస్థాన్ జట్టు మీద విరుచుకుపడిన 17 ఏళ్ల యువక్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ను ప్రశంసించాడు. అతనిని క్రికెటర్ రంగంలో ఎదిగేందుకు అందరూ సహకరించాలని, అతనికి మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచించాడు. అద్భుతంగా ప్రదర్శిస్తున్న అతగాడు భవిష్యత్తులో ఇండియా జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతాడని పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  Pace Bowlers  Sunil Narine  New Cricketers  IPL 8  

Other Articles