Chennai superkings only for five lakhs.

Chennai superkings only for five lakhs

chennai, super kings, srinivasan, bcci, IPL 8, Cricket IPL 8, NewsIPL 8, teamsIPL 8, CSKB, oard of Control for Cricket in India (BCCI)India Cements LimitedN Srinivasan

The new dispensation of the Board of Control for Cricket in India (BCCI) is least impressed with troubled IPL franchise Chennai Super Kings (CSK), owned by former board president and India Cements Limited (ICL) vice-chairman and managing director N Srinivasan.

ఐదు లక్షలకే చెన్నై.. వినండహో విడ్డూరం

Posted: 04/24/2015 12:55 PM IST
Chennai superkings only for five lakhs

నిజమే.. చెన్నై సూపర్ కింగ్స్ విలువ 5 లక్షల రూపాయలు మాత్రమే..! నమ్మశక్యంగా లేకున్నా నమ్మక తప్పదు.అదేంటి ఐపీఎల్ జట్టు ప్రాంజైజీ అంటే కొట్లలో ఉంటుంది. అదీ చెన్నై సూపర్ కింగ్స్ అంటే వందల కోట్లు ఉండాలి కాని 5 లక్షలేంటి అనే డౌట్ వస్తుంది కదా..! మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనవాసన్‌ చైర్ మెన్ ,ఇండియా సిమెంట్స్‌కు చెందిన చెన్నై జట్టు ఈ సంవత్సరం ప్రాంచైజీ విలువ రూ. 5 లక్షలుగా చూపించి కొత్త వివాదాల్లో చిక్కుకుంది . గతేడాది చెన్నై జట్టు విలువ రూ. 450 కోట్లు ఉంటే, ఈ ఏడాది జట్టు విలువ కేవలం రూ. 5 లక్షలేనని ఫ్రాంజైజీ ప్రకటించింది. దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంజైజీ తీరుని మండిపడుతుందట.

చెన్నై సూపర్ కింగ్స్ విలువ గత సంవత్సరంలోనే 450 కోట్లు మరి ఈ సంవత్సరం 5 లక్షలకు ఎలాపడిపోతుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రశ్నించింది. ఫ్రాంజైజీ జట్టు విలువను సరిగా చూపించపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చిరించింది. బీసీసీఐకి ఒక ఐపిఎల్ జట్టు ఫ్రాంజైజీ అమ్మకపు విలువలో 5శాతం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆజట్టు ఇప్పడు చెల్లించింది 25,000 అన్నమాట. రెండు సార్లు విజేతగా నిలిచి , పెద్ద పెద్ద స్టార్ ఆటగాళ్లున్న చెన్నై జట్టు విలువ ఇప్పుడు కేవలం 5 లక్షలేనంటె.. మేము కోనుగోలు చేస్తామంటూ ఫేస్‌బుక్ ట్విట్టర్‌లో ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 5 లక్షలుంటే మనమూ చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంజైజీ ఓనర్ కావచ్చన్నమాట..!
***

శ్రీనివాసన్ ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోయింది. నిన్నటి దాకా బిసిసిఐని ఇష్టారాజ్యంగా వాడుకున్న శ్రీనివాసన్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయినా శ్రీనివాస లీలలు చాలానే ఉన్నాయి ఇది కేవలం శాంపిల్ మాత్రమే అని అంటున్నారు అతడి గురించి తెలిసిన వాళ్లు. ఏది ఏమైనా మీ దగ్గర 5లక్షలు ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ టీంను కొనెయ్యొచ్చు. మరి ఆలస్యం ఎందుకు వెంటనే ముంబై బయలుదేరండి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles