MS Dhoni speaks about daughter Ziva and how she has changed his life

Zivas smile has changed my life says ms dhoni

Ziva's smile has changed my life, says MS Dhoni, MS Dhoni speaks about daughter Ziva and how she has changed his life, Mahendra singh dhoni, MS Dhoni, Ziva, Chennai Super Kings, CSK, IPL, IPL 8, IPL news, cricket news, dhoni on ziva

MS Dhoni, the Team India captain, spoke about his only daughter Ziva and how she has changed his life. Dhoni, who became father in Feb 2015, said that he missed her when she was born.

జీవా నవ్వు.. జీవితాన్ని మార్చేస్తుంది.. చాలా బాధపడ్డానంటున్న ధోని

Posted: 04/22/2015 06:29 PM IST
Zivas smile has changed my life says ms dhoni

భారత జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోని తన పాప గురించి ప్రస్తావించారు. అది కూడా అలా ఇలా కాదు.. తన పుత్తడి బోమ్మి నవ్వు.. తన జీవితాన్నే మార్చేసిందని గారాలబోయాడు. అస్ట్రేలియా పర్యటనకని జట్టుతో పాటుగా బయలుదేరి వెళ్లిన భారత క్రికెట్ కెప్టన్ మహేంద్ర సింగ్ దోని.. ఆ తరువాత అసీస్, ఇంగ్లాండ్ తో జరిగిన ముక్కోణపు వన్డే సీరిస్ లో వుండగా, ఆయనకు శుభవార్త అందింది. తాను తండ్రిని అయ్యానని, తన ఇంటి మహాలక్ష్మీ జన్మించిందని.. దీంతో తన సంబరాన్నంతా దాచుకున్న ఆయన.. ప్రపంచ కప్ పైనే తన దృష్టి అంతా వుందని బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో జీవాను చూసేందుకు కూడా వెళ్లనన్నారు.

అయితే.. ప్రపంచకప్ పోరాటంలో సెమీస్ వరకు దిగ్విజయంగా వెళ్లిన.. టీమిండియా.. ఆ తరువాత..ఓటమిపాలై.. వెనుదిరగడంతో.. కొంత నైరాశ్యంలోనే వెనుదిరిగిన ఆయన ఆ తరువాత ఐపీఎల్ మ్యాచ్ లతో బిజీగా మారినా.. ఇప్పుడు కాస్త విరామం దొరికినప్పుడల్లా తన కూతురు జీవా గురించే సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన జీవా గురించి మీడియాతో కూడా ముచ్చటించాడు. తన భార్య ప్రసవించినపుడు పక్కన లేకపోవడం బాధ కలిగించిందన్నాడు. తన పాప రాకతో జీవితం చాలా మారిందన్నాడు. పాప పుట్టినప్పుడు భారత్ తో లేనని, చాలా రోజులు తనను చూడలేదని, ఆ సమయంలో చాలా కష్టంగా గడిచిందని తన బాధన బహిర్గతం చేశాడు. తన పసిపాప నవ్వు చేస్తే చాలు.. తన జీవితం మారిపోతుందన్నాడు. తాను టీమిండియాకు అడుతున్నానా.. లేక చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్నానా.. అన్న వాటితో సంబంధం లేకుండా తన జీవా ఎప్పుడు ఏడవాలనిపిస్తే అప్పుడు ఏడుస్తుందని, ఎప్పుడు నవ్వాలనిపిస్తే.. అప్పుడు నవ్వుతుందని దోప్పాడు దోని. ఇది మంచి అనుభూతిని ఇచ్చే విషమన్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Ziva  Chennai Super Kings  CSK  IPL  IPL 8  IPL news  cricket news  

Other Articles