Mumbai Indian Finally Won Match After 4 Defeats | IPL 8

Mumbai indians won match against royal challengers bangalore team ipl8

mumbai indians, royal challengers bangalore, bangalore city, royal challengers bangalore, ipl 8 season, ipl 8 matches, ipl 8 season news, ipl 8 schedule, ipl 8 updates, ipl 8 stats, ipl 8 cricket teams, mumbai indians players, rohit sharma, ab de villiers, unmukt chand, harbhajan singh, kieron pollard

mumbai indians won match against royal challengers bangalore team ipl8 : Finally Mumbai Indians Won their first match against royal challengers bangalore team in chinnaswamy stadium after 4 defeats.

బోణీ కొట్టిన ముంబై.. కోహ్లీకి తప్పని మరో పరాజయం

Posted: 04/20/2015 11:21 AM IST
Mumbai indians won match against royal challengers bangalore team ipl8

ఐపీఎల్-8 సీజన్ లో భాగంగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. జట్టులో మెరుగైన ఆటగాళ్లు వున్నప్పటికీ వరుసగా నాలుగు మ్యాచులు ఓడిపోయిన ముంబై.. చివరకు తన ప్రతాపాన్ని బెంగుళూరు జట్టుపై ప్రదర్శించి సత్తా చాటింది. ప్రత్యర్థి జట్టులో కూడా అద్భుత ఆటగాళ్లు వున్నా.. ముంబై బౌలర్లు వారిని ధీటుగానే ఎదుర్కోవడంతో ఈ విజయం వారికి వరించింది. మొదట ముంబై భారీ స్కోరు నమోదు చేయగా.. దాన్ని ఛేజ్ చేసేందుకు బెంగుళూరు ఆటగాళ్లు చివరిదాకా కష్టపడ్డారు కానీ.. 18 పరుగులతో ఓడిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. మొదట టాస్ గెలిచి బెంగుళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని ముంబై ఆటగాళ్లను బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించింది. దీంతో బరిలోకి దిగిన ముంబై బ్యాట్స్ మెన్లు మొదటి నుంచే చెలరేగారు. మొదటి ఓవర్ లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన ముంబై.. ఆ తర్వాత తమ ప్రతాపం చూపారు. ఈ నేపథ్యంలోనే ఓపెన్ లెండిల్ సిమ్మన్స్ (59)తోపాటు ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ఉన్ముక్త్ చంద్ (58) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఇక తర్వాత సెకండ్ బౌన్ లో క్రీజులోకి వచ్చిన ఆ జట్టు కెప్టెన్ కేవలం 15 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. ఇలా వీరు ముగ్గురి భారీ స్కోరుతోపాటు మిగిలిన ఆటగాళ్ల స్కోరుతో కలిపి ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు మొత్తం 209 పరుగులు చేసింది.

de-villers-parthiv

ఇక 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు ఆటగాళ్లు మొదట్లోనే తడబడ్డారు. విధ్వంసక ఆటగాడైనా క్రిస్ గేల్ (10) మరోసారి విఫలమయ్యాడు. కెప్టెన్ కోహ్లీ కూడా 18 పరుగులకే చేసి చేతులెత్తేశాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ (11 బంతుల్లో 41), డేవిడ్ వైస్ (47) పోరాడినా.. మిగిలిన ఆటగాళ్లు తక్కువ స్కోరు చేసి పవెలియన్ చేరడంతో బెంగుళూరు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దీంతో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులే చేయగలిగింది. ఇక బంతితో చేలరేగి మూడు కీలక వికెట్లు తీసిన ముంబై బౌలర్ హర్భజన్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai indians  royal challengers bangalore  chinnaswamy stadium  ipl 8  

Other Articles