Virat Kohli speaks up, says people should be ashamed for criticising Anushka

Kohli breaks silence on world cup loss hurt they should be ashamed

Virat Kohli defended his girlfriend Anushka Sharma, Kohli breaks silence on World Cup loss, Virat Kohli says people should be ashamed for criticising Anushka, virat lambasts on fans who criticized anushka, Anushka sharma, Virat kohli, world cup, semi final, Australia,

Virat Kohli defended his girlfriend Anushka Sharma and lambasted those who criticized his actress girlfriend.

ఓటమికి అనుష్కకు సంబంధమేంటీ..? కోహ్లీ ప్రశ్న

Posted: 04/10/2015 04:28 PM IST
Kohli breaks silence on world cup loss hurt they should be ashamed

ప్రపంచ కప్ క్రికెట్ టార్నమెంటు సెమీ ఫైనల్ లో ఓటమి తరువాత టీమిండియా వైస్ కెప్టన్ విరాట్ కోహ్లీ కాస్త ఆలస్యంగా.. ఆ మ్యాచ్ లో తన వైఫల్యంపై స్పందించారు. ప్రపంచకప్ తరువాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ..వరల్డ్ కప్ లో ఓటమి ఎరుగని జట్టుగా సాగిపోతున్న తరుణంలో సెమీస్ లో ఓటమి పాలు అవ్వడం.. అసీస్ పై గెలుపుకు కృషి చేస్తున్న తరుణంలో.. తాను ఒక్క పరుగుకే అవుట్ అవ్వడం.. తనకే కలవర పాటుకు గురిచేసిందని అన్నారు. అయితే తన నుంచి పరుగుల వరదను అంచనా వేసిన అభిమానులు.. ఇది నిరాశ కలిగించే అంశమని అంగీకరించిన కోహ్లీ.. అంతమాత్రాన తనపై అభిమానులు అక్రోశాన్ని వెల్లగక్కడం సహేతుకం కాదన్నారు.

తనపై వచ్చిన విమర్శలతో తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. వరల్డ్ కప్ లోని ప్రతీ మ్యాచ్ ను స్థిరంగా ఆడటానికే ప్రయత్నించానన్న కోహ్లీ.. భారత జట్టు తరపున ఆడుతున్న ప్రతీ మ్యాచ్ లోనూ తాను రాణించాలనే అడుతానన్నాడు. సోషల్ మీడియాలో తనపై అభిమానులు విమర్శలు చేయడం సరికాదన్నారు. సెమీస్ లో ఓటమికి తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మకు సంబంధమేంటిని సూటిగా అభిమానులను ప్రశ్నించారు. అయినా ఒక్క మ్యాచ్ లో  సరిగ్గా అడకపోతే ఇన్ని నిందలా వేస్తారా..? అంటూ ప్రశ్నించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Anushka Sharma  World Cup 2015  Royal Challengers Bangalore  

Other Articles