MS Dhoni flaunts his brand new Kawasaki bike on Instagram

Mahendra singh dhoni fined for violating traffic rules

MS dhoni, indian captain dhoni, IPL 8, Ms Dhoni Fined, Dhoni Rs 450 For Violating Traffic Rule, dhoni violates traffic rules in Ranchi, Dhoni flaunts his brand new Kawasaki bike on Instagram, Indian Star batsman virat kohli, Indian opener Rohit sharma, Indian batting legend sachin tendulkar, Royal Challengers Bangalore IPL 8, Indian Premier league 2015, IPL season 8, chennai super kings

Mahendra Singh Dhoni was fined by the Ranchi traffic police for not displaying the number plate on the front and rear of his vehicle.

బుల్లెట్ పై తిరిగి కెప్టన్ మహేంద్రసింగ్ ధోని.. జరిమానా కూడా కట్టాడు..

Posted: 04/08/2015 06:50 PM IST
Mahendra singh dhoni fined for violating traffic rules

అనునిత్యం కూల్ గా వుంటే భారత క్రికెట్ కెప్టన్ మహేంద్ర సింగ్ దోనికి వాళ్లు షాకిచ్చారు. అసీస్ కెప్టన్ క్లార్క్, న్యూజీలిండ్ కెప్టన్ బ్రెడిన్ మెక్ కల్లమ్ లను మించి.. చాలా ప్రశాంతంగా వుంటే కెప్టన్ అంటూ నిన్ననే న్యూజీలాండ్ క్రికెటర్ హస్సీ ప్రకటనలు చేసిన 24 గంటలు గడవకముందే.. వాళ్లు ధోని వెనకబడి మరీ చిరెత్తించారు. ఇక చేసేది లేక.. తప్పు చేశానని వాళ్లకు 450 రూపాయలు ఇచ్చాడు ధోణి. అదేంటనుకుంటున్నారా..? ధోని తప్పుచేయడమేంటని నివ్వెరపోతున్నారా..?

అవునండీ ధోని తప్పు చేశాడు. తాను కోత్తగా కోన్న బైక్ ను తన ఇస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశాడు. అది కూడా తప్పే..? అంటున్నారా...? విషయానికి వస్తున్నాం. దోని తన కోత్త బైక్ ను రాంచీలోని రోడ్లపై నడుపుతూ ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించాడు. దీంతో రాంచీ ట్రాఫిక్ ఫోలీసులు ఆయనకు రూ.450లు జరిమానా విధించారు. ఇంతకీ ధోని ఎలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడు అంటున్నారా..? ధోనీ కొత్తగా కోన్న బుల్లెట్ కు  నెంబర్ ప్లేట్ లేదని రాంచీ పోలీస్ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని రాంచీ ట్రాఫిక్ పోలీస్ సూపరింటెండెంట్ కార్తీక్ ధ్రువీకరించారు.
 
ఈ విషయం గురించి కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిలో రిజిస్టర్ కాని, మిస్సింగ్ నెంబర్ ప్లేట్స్ తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో ధోనీ బుల్లెట్ కు నెంబర్ ప్లేట్ లేదని గుర్తించామని తెలిపారు. దీంతో ఆయనపై జరిమానా విధించినట్టు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కొన్ని సాంకేతిక కారణాల వలన జరిమానా విధించాం అని ట్రాఫిక్ ఎస్ పీ చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  Ranchi police  Traffic Rules  

Other Articles