ప్రపంచ కప్ లో ఇవాళ సడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిఫెండింగ్ ఛాంపియన్స్ టీమిండియాను 95 పరుగులతో ఓటించిన అతిధ్య జట్టు అస్ట్రేలియా ఈ నెల 29న ఛాంపియన్ షిప్ టైటిల్ కోసం మరో అతిత్య జట్టు న్యూజీలాండ్ తో తలపడనుంది. గత 7 పర్యాయాలుగా, 28 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా అసియా ఖండంలోని దేశాలు లేకుండా ప్రపంచ క్రికెట్ కప్ ఫైనల్ జరగనుంది. తొలి సెమీఫైనల్ లో సౌత్ ఆప్రికాను ఓడించిన న్యూజీలాండ్.. రెండో సెమీ ఫైనల్ లో భారత్ ను ఓడించిన అస్ట్రేలియాలు రెండు తలపడనున్నాయి. ఇందుకు అస్ట్రేలియాలోని మెల్ బోర్న్ స్టేడియం వేదిక కానుంది.
గత ఏడు పర్యాయాలుగా అసియా ఖండంలోని పాకిస్థాన్, శ్రీలంక, భారత్ దేశాలలో ఏదో ఒక్క దేశం ప్రపంచ కప్ పైనల్ లో ప్రత్యర్థులతో తలపడిందని.. పలు సందర్భాలలో ప్రపంచ విజేతగా నిలిచినా.. మరికోన్ని సందర్బాల్లో ప్రత్యర్థి జట్లకు కప్ అందించింది. అయితే ఈ ధఫా మాత్రం ఆసియా ఖండంలోని దేశాలు లేకుండానే జగ్గజ్జేత సమరం జరగనుంది. కాగా రెండు అతిథ్య జట్ల మధ్య పోటీ ఎంత రసవత్తరంగా వుంటుందో వేచి చూడాలి. మరోవైపు 14 జట్లు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్లో చివరకు ఆతిథ్య జట్లే టైటిల్ రేసులో మిగిలాయి. ఈ నెల 29న మెల్బోర్న్లో జరిగే గ్రాండ్ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఆసీస్ ఇప్పటి వరకు 4 ప్రపంచ కప్లు గెలవగా, కివీస్ తొలిసారి ఫైనల్ చేరింది.
తాజా ఈవెంట్లో ఈ రెండు జట్లూ గ్రూపు-ఎలో ఆడాయి. లీగ్ దశలో కివీస్.. ఆసీస్ను ఓడించింది. కివీస్ ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ చేరగా, ఆసీస్ ఓ మ్యాచ్లో మాత్రం ఓడింది. ఆరు లీగ్ మ్యాచ్ల్లోనూ నెగ్గిన కివీస్ క్వార్టర్స్, సెమీస్లోనూ సంచలన విజయాలు సాధించింది. అయితే ఈ మ్యాచ్లన్నీ స్వదేశంలో, చిన్న మైదానాల్లో జరిగాయి. ఫైనల్ సమరం ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతోంది. ఫైనలిస్టులు ఆసీస్, కివీస్ సమవుజ్జీలుగా కనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్ కొత్త చాంపియన్గా అవతరిస్తుందా? లేక ఆసీస్ ఐదోసారి జగజ్జేతగా నిలస్తుందా అన్న విషయం 29న తేలనుంది. ఏదేమైనా ఆతిథ్య జట్టే ప్రపంచ చాంపియన్ కాబోతోంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more