India cricket team worldcup 2015 innings 7 matches 70 wickets history

india cricket team, icc worldcup 2015, india worldcup 2015 innings, india vs bangladesh, india vs pakistan match, indian cricketers, indian bowlers, indian batsmen, india captain, mohammad shami, umesh yadav, ravichandran ashwin, mohit sharma, mahendra singh dhoni, virat kohli, rohit sharma, suresh raina

india cricket team worldcup 2015 innings 7 matches 70 wickets history : The list how india took all 70 wickets in worldcup 2015 which is the first record made by India Country.

ఆ 70 మందిని భారత్ ఎలా భరతం పట్టిందో తెలుసా..?

Posted: 03/20/2015 12:30 PM IST
India cricket team worldcup 2015 innings 7 matches 70 wickets history

ప్రపంచకప్ టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా జట్టు క్వార్టర్స్ లో బంగ్లాదేశ్ ను చిత్తుచేసి భారత్ సెమీ ఫైనల్స్ కు చేరిపోయిన విషయం తెలిసిందే! ఆ విషయం కాస్త పక్కనపెడితే..  ప్రపంచకప్ చరిత్రలో వరుసగా ఏడు మ్యాచుల్లో 70 వికెట్లు తీసిన మొదటిజట్టుగా టీమిండియా రికార్డులకెక్కింది.

నిజానికి ఈ వరల్డ్ కప్ టోర్నీ మొదలు కావడానికి ముందు భారత్ బౌలింగ్ తేలిపోతుందని విశ్లేషకులు అంచనా వేశారు. అంతేకాదు.. క్వార్టర్స్ లోనే ఇండియా వెనుదిరుగుతుందని అభిప్రాయాలు కూడా తెలిపారు. అయితే.. వారి అంచనాలను తిప్పికొడుతూ.. భారత సీమర్లు, స్పిన్నర్లు చెలరేగి.. తమ ప్రత్యర్థుల భరతం పట్టారు. ఒక్కొక్క టీమ్ ను పవెలియన్ దారిపట్టించారు. తొలిసారి ఏడు మ్యాచుల్లోనూ 70 వికెట్లు తీసిన మొదటిజట్టుగా భారత్ ను నిలబెట్టారు. ఇంతకీ.. టీమిండియా ఆ 70 మందిని ఎలా భరతం పట్టిందో తెలుసా..?

ఇండియా సాధించిన 70 వికెట్లలో 43 వికెట్లను పేసర్లు తమ ఖాతాలో వేసుకుంటే, స్పిన్నర్లు 22 మందిని పవెలియన్ బాటపట్టించారు. మరో ఐదుగురు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. ఇక ఫీల్డింగ్ లోనూ అద్భుతంగా రాణించిన ఇండియా ఆటగాళ్లు మొత్తం 36 క్యాచ్ లు పడితే, ధోనీ 14 క్యాచ్ లు పట్టుకున్నాడు. ఇక 8 మందిని బౌల్డ్ చేయగా, ముగ్గుర్ని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపారు భారత్ బౌలర్లు! ఐదుగుర్ని రనౌట్, నలుగుర్ని కాట్ అండ్ బౌల్డ్ గా బౌలర్లు ప్రత్యర్థులను పవెలియన్ బాటపట్టించారు. ఇలా ఈ విధంగా ఇండియా జట్టు ప్రత్యర్థుల మీద చిరుతల్లా చెలరేగిపోయారు.

ఇక భారత బౌలర్లు ఎవరెవరు ఎన్ని వికెట్లు తీసుకున్నారోనన్న అంశానికి వస్తే.. మహ్మద్ షమీ 17 వికెట్లు తీసుకోగా, ఉమేష్ యాదవ్ 14 తీసుకున్నారు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ 12 వికెట్లు పడగొట్టగా, మోహిత్ శర్మ 11 వికెట్లు తీసుకున్నాడు. మొత్తానికి ఈసారి వరల్డ్ కప్ లో యంగ్ క్రికెటర్స్ తమ సత్తా చాటుకుని, ఇండియాని గెలుపుదిశగా తీసుకెళ్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india cricket team  worldcup 2015  india worldcup 2015 innings  indian bowlers  

Other Articles