ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా నాకౌట్ ధశలో అడుగుపెట్టి మరో అంకానికి తెరలేవడంతో.. రేపు మెల్ బోర్న వేదికగా జరగనున్న రెండవ క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాతో జరగనున్న మ్యాచ్ లో గెలుపోంది సెమీస్ లోకి అడుగుపెట్టాలని టీమిండియా ఆరాటపడుతుంది. ఢిపెండింగ్ ఛాంఫియన్ గా ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులోకి అడుగుపెట్టిన ధోణిసేన గ్రూప్ బిలో లీగ్ దశలో ఓటమెరుగని జట్టుగా డబుల్ హ్యాట్రిక్ సాధించింది. నాకౌట్ దశలోనూ మరో హ్యాట్రిక్ నమోదు చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగే నాకౌట్ సమరానికి సన్నద్ధమైంది.
రేపు జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో ఉపఖండం భారత్ తో అసియా ఖండానికి చెందిన మరో జట్లు బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ప్రపంచ కప్లో జైత్రయాత్ర కొనసాగించాలని ధోనీసేన ఆరాటపడుతుంటే.. అంచనాలకు మించి రాణిస్తూ ఇంగ్లాండ్ పై నమోదు చేసుకున్న విజయోత్సాహంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి, దాయాధి పాకిస్థాన్పై ఘనవిజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికాకు షాకిచ్చింది. ఆనక యూఏఈ, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వేలను ఓడించి ధోనీసేన జైత్రయాత్ర కొనసాగించింది. ఆరు మ్యాచ్ల్లో ఆరు జట్లనూ ఆలౌట్ చేసింది. ఏ మాత్రం అంచనాలు లేనప్పటికీ, అంతా కోత్తగా జట్టులో చేరిన యువ బౌలర్లు.. అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. పేసర్లు, స్పిన్నర్లు, పార్ట్ టైమర్లు సమష్టిగా రాణిస్తున్నారు. ధోనీసేన ఇదే జోరు సాగిస్తే బంగ్లాదేశ్కు ఓటమి తప్పదు.
బంగ్లా విషయానికొస్తే 6 లీగ్ మ్యాచ్ల్లో మూడింటిలో నెగ్గింది. అగ్రశ్రేణి జట్టు ఇంగ్లండ్ను ఓడించింది. గతంలో భారత్నూ ఓడించిన చరిత్ర ఉంది. అయితే బంగ్లాకు నిలకడలేమి ప్రధాన సమస్య. ఎప్పుడెలా ఆడుతుందో చెప్పడం కష్టం. బంగ్లా బ్యాటింగ్ లైనప్లో మహ్మదుల్లా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ ఈవెంట్లో రెండు సెంచరీలు చేశాడు. ముష్ఫికర్ రహీం, షకీబల్ హసన్ కూడా కీలకం. బౌలింగ్ విభాగంలో సమస్యలు ఎదుర్కొంటోంది. బౌలర్లు నిలకడగా రాణించలేకపోతున్నారు. కాగా, 2007 ప్రపంచ కప్లో భారత్.. బంగ్లా చేతిలో ఓడిపోగా.. గత ప్రపంచ కప్లో భారత్.. బంగ్లాపై విజయం సాధించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more