South africa crush sri lanka by 9 wickets

South Africa crush Sri Lanka by 9 wickets, imran thahir boling and Duminy hat-trick leaves SL in tatters, Srilanka versus South africa, Srilanka vs South africa, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, South africa, South africa CWC 2015, Live Scores, Live Updates, Srilanka, Srilanka CWC 2015, Sports, World Cup Live, sangakkara, dilshan

imran thahir boling and Duminy hat-trick leaves SL in tatters

వరల్డ్ కప్ సెమీస్ లోకి సఫారీలు.. భీతిల్లిన లంకేయులు ఔట్..

Posted: 03/18/2015 05:26 PM IST
South africa crush sri lanka by 9 wickets

ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో భాగంగా నాకౌట్ ధశలోకి అడుగుపెట్టిన జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరుగిన తొలి క్వార్టర్ ఫైనల్స్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో దక్షిణాప్రికాతో ఘనవిజయాన్ని నమోదు చేసుకుని సెమీ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. శ్రీలంక నిర్దేశించిన 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక్క వికెట్ నష్టపోయి కేవలం 18 ఓవర్లలో ఛేదించింది. తొలి క్వార్టర్ ఫైనల్ లో లంకపై సఫారీలు 9 వికెట్లతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 40 పరుగుల వద్ద ఆమ్లా(16) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఒక్క పోరు సాయంతో 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అమ్లా ఔవుట్ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్ కేవలం సింగిల్స్, డబుల్స్ తో 21 పరుగులు సాధించగా, డికాక్ 12 బౌండరీల సాయంతో 78 పరుగుల చేసి సాత్ ఆప్రీకాకు విజయాన్ని అందించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 94 పరుగుల రికార్డు అజేయ భాగస్వామ్యాన్ని జోడించారు. లంక బౌలర్లలో మలింగకు ఒక వికెట్ మాత్రమే దక్కింది. మాథ్యూ సేన బ్యాటింగ్ పతనాన్ని శాసించిన దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ గెలుపుతో సఫారీలు పైమీస్ కు తమ మార్గం సుగమం చేసుకోగా,  నాల్గవ క్వార్టర్ ఫైనల్ లో తలపడే న్యూజీలాండ్, వెస్టీండీస్ విజేతతో న్యూజీలాండ్ లోని అక్లాండ్ వేదికగా ఈ నెల 24న జరిగే మ్యాచ్ లో వీరు తలపడనున్నారు. మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చి సెమీస్‌కు తీసుకెళ్లారు.  

అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన లంకేయులు సఫారీల బాలింగ్ ధాటికి కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లు ఆది నుంచి క్రమంగా వికెట్లను తీయడంతో లంకేయుల టాప్, మిడిల్ ఆర్డర్ సహా టెయిల్ ఎండర్లు కూడా రాణించాలేకపోయారు. .4 పరుగులకే ఓపెనర్లు పెరీరా(3), దిల్షాన్(0) వికెట్లను లంక సమర్పించుకుంది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సంగక్కర, తిరిమానెలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. సంగక్కర నెమ్మది ఆడుతుంటే, తిరిమానె దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ జట్టు స్కోరు 50 పరుగులు దాటించడమే కాకుండా మూడో వికెట్‌కు 50 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని జోడించారు. అ తరువాత 41 వ్యక్తిగత పరుగలు స్కోరు వద్ద తిరిమానె తాహిర్ బౌలింగ్‌లో ఔటుకాగా,. ఆ తర్వాత వచ్చిన జయవర్దనె(4) కూడా తక్కువ పరుగులకే ఔట్ కావడంతో మ్యాచ్ భారం సంగక్కర, కెప్టెన్ మాథ్యూస్‌లపై పడింది. వీరిద్దరూ కొద్దిసేపు దక్షిణాఫ్రికా బౌలర్లను ప్రతిఘటించారు. అంతేకాకుండా జట్టు స్కోరు 100 పరుగులు దాటించడంతో కీలక పాత్ర పోషించారు. 32 బంతుల్లో 19 పరుగులు చేసిన కెప్టెన్ మాథ్యూస్... డుమిని బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అ తరువాత వచ్చిన టెయిల్ ఎండర్లు సఫారీల బంతులకు మోకరిల్లారు.

వరుస సెంచరీలతో రాణించిన సంగక్కర కూడా అర్థ శతకానికి చేరువలో బోల్లాపడ్డాడు. దీంతో శ్రీలంక కేవలం 133 పరుగులను మాత్రమే సాధించింది. కాగా సౌత్ ఆఫ్రికా బౌలర్ డుమిని హ్యాట్రిక్ తో మెరిశాడు. సఫారీ బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ 4 వికెట్లు, డుమిని ముడు వికెట్లు తీయగా, డెయిల్ స్టీయిన్, కెల్ అబాట్, మార్కెల్ చోరో విక్కెట్ తీశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Srilanka  South Africa  

Other Articles