ప్రపంచకప్-2015 టోర్నమెంట్ లో భాగంగా ఫుల్ జోష్ మీదున్న ఇండియన్ ఎనర్జిటిక్ బ్యాట్స్ మన్ సురేష్ రైనా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన ప్రియాంక చౌదరిని ఇతగాడు వివాహమాడనున్నట్లు సమాచారం! ఇప్పటికే ఇరువురి కుటుంబసభ్యులు వీరిద్దరి పెళ్లిని ఫిక్స్ చేసేశారు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 3వ తేదీన ఢిల్లీలో చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరుగుతుంది. మీరట్ సమీపంలోని బారుట్కు చెందిన ప్రియాంక.. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో బ్యాంకర్‌గా పని చేస్తోంది.
ఇంకో విషయం ఏమిటంటే.. వీరిద్దరి కుటుంబాలకు సుదీర్ఘకాలం నుంచి మంచి సాన్నిహిత్యమే వుంది. ఇద్దరి తండ్రులు మురాద్‌నగర్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో కలిసి పని చేశారు కూడా! ఇప్పుడు ఆ సాన్నిహిత్యమే బంధంగా మారనుంది. ఈ నెల 12వ తేదీన పెళ్లికి ముందు నిర్వహించే సంప్రదాయ ‘రోకా’ వేడుకను కూడా ముందుగానే జరిపించేశారు. ఈ కార్యక్రమం అనంతరం రైనా కుటుంబసభ్యులు పెళ్లి విషయాన్ని ధ్రువీకరించారు. ఏప్రిల్ 3వ తేదీన పెళ్లి ముగిసిన అనంతరం 8వ తేదీన రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇదిలావుండగా.. గతంలో రైనా పెళ్లికి సంబంధించి ఎన్నోరకాల రూమర్లు వెలువడ్డాయి. ఇతగాడు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ హీరోయిన్ తో రహస్యంగా ప్రేమాయణం నడుపుతున్నాడని, ఆమెతోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే.. అవన్నీ రూమర్లేనంటూ రైనా అప్పట్లో కొట్టిపారేసినప్పటికీ అవి అలాగే కొనసాగాయి. అయితే.. ఇప్పుడీ పెళ్లి విషయంతో వాటికి ఫుల్ స్టాప్ పడినట్లే లెక్క!
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more