Raina dhoni lead india to emphatic 6 wicket victory over zimbabwe

team India double hatrick in world cup, defending champions team India, MS dhoni, Shikar dhawan, Rohit sharma, virat kohli, India vs Zimbamwe, India versus zimbamwe, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, India, India CWC 2015, Live Scores, Live Updates, Zimbamwe, Zimbamwe CWC 2015, Sports, World Cup Live

Suresh Raina hit a rollicking century as India recovered from a top-order collapse to prevail over minnows Zimbabwe by six wickets, finishing their group league engagements with a clean slate in the Cricket World Cup.

రైనా, దోణిల దూకుడుతో ‘సిక్సర్’ కొట్టిన టీమిండియా

Posted: 03/14/2015 05:02 PM IST
Raina dhoni lead india to emphatic 6 wicket victory over zimbabwe

న్యూజీలాండ్ లోని అక్లాండ్ స్టేడియంలో టీమిండియా ఆటను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు తొలి పాతిక ఓవర్లలో నిరుత్సాహం. స్టేడియం నుంచి భయటకు వచ్చేయాలనించేలా నిసృహ. ఆ నిరాశానిసృహాలను చీల్చుకుంటే వచ్చిన నూతనోత్తేజం.. ఆ జోడి ఆట తీరు చూసి ప్రేక్షకుల కరతాళాధ్వనులు.. చివరి ఓవర్లలో ఫోర్లు, సిక్సర్ లతో వన్డే కు బదులు టీ 20 మ్చాచ్ ను తలపించేలా సాగిని లక్ష్య చేధన దృశాలను వారు ఎన్నటికీ మర్చిపోలేదు. అప్పటి వరకు భారత్ పై అదిపత్యాన్ని కనబర్చిన జింబాబ్వే ఆటగాళ్లలో ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. అప్పటి వరకు తమకు మద్దతుగా స్టేడియం గ్యాలరీల్లోంచి వినిపించిన ధ్వనులు.. ఆ జోడి కోడుతున్న భారీ షాట్లలో కలసిపోయాయి.

ఢిపెండింగ్ ఛాంపియన్లుగా ప్రపంచకప్ బరిలో దిగిన టీమిండియా.. లీగ్ దశలో ఆరు వరుస విజయాలను నమోదు చేసుకుని సిక్సర్ కొట్టింది. జింబాబ్వేతో జరుగిన చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఆరు విక్కట్ల తేడాతో గెలుపోందింది. కెప్టెన్ దోణి, సురేష్ రైనాలు దూకుడుగా ఆడి టీమిండియాకు విజయానందించారు. ఈ వరల్డ్ కప్ లో సురేష్ రైనా అద్భుత తొలి సెంచరీతో రాణించి నాలుగు సిక్స్ లు, తోమ్మిది ఫోర్ల సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలువగా, కెప్టెన్ దోణి కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రెండు సిక్స్ లు ఎనమిది ఫోర్లతో 85 పరుగులు సాధించి టీమిండియాకు ఘన విజయాన్నిందాడు.

బింబాబ్వే తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ ప్రారంభంలోనే టాప్ ఆర్డర్ తడబడి.. నాలుగు విక్కెట్లను కోల్పోయింది. తినాషి పన్యంగర వేసిన ఆరవ ఓవర్ లో ఓపెనర్ల విక్కెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాగా,  అదే ఓవర్ లో ఐదవ బందతికి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (4) విక్కెట్ కోల్పయి కష్టాల్లో పడింది. ఆ తరువాత 16 ఓవర్లో అజ్యింక రహనే (19) విక్కెట్ ను కొల్పోగా,  22 వ ఓవర్ లో విరాట్ కోహ్లీ (33) ఔలయ్యాడు. రజా వేసిన సాధారణమైన బంతిని స్లీప్ చేయబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరుణంలో సురేష్ రైనా-మహేంద్ర సింగ్ ధోనీలు ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేశారు. గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తూ.. టీమిండియాకు విజయాన్ని అందించారు.

అంతకుముందు బ్యాటింగ్ దిగిన జింబాబ్వే 48.3 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వేకు ఆరంభంలో కష్టాలు ఎదురయ్యాయి. భారత బౌలర్ల ధాటికి  జింబాబ్వే 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద జింబాబ్వే ఓపెనర్ మసకద్జ.. భారత పేసర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ చిబాబా.. షమీ బౌలింగ్లో ధావన్కు దొరికిపోయాడు. కాసేపటికి మోహిత్ శర్మ ఓవర్లో మిరె పెవీలియన్ బాటపట్టాడు. దీంతో జింబాబ్వే కష్టాల్లోపడింది. 20 ఓవర్ల వరకు ఆచితూచి ఆడింది. కెప్టెన్ బ్రెడిన్ టేలర్, ఆయనకు తోడు విలియమ్స్ క్రమేణా దూకుడు పెంచారు. టేలర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. టేలర్.. విలియమ్స్తో కలసి నాలుగో వికెట్కు 93 పరుగులు, ఎర్విన్తో ఐదో వికెట్కు 109 పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, షమీ, మోహిత్ శర్మలకు మూడేసి విక్కట్లు లభించగా, అశ్విన్ కు ఒక వికెట్ లభించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  India  Zimbamwe  

Other Articles