Richardson warns india against chris gayle

Richardson, chris Gayle, West Indies, AB de Villiers, world cup 2015, pakistan, southafrica, soute, team india, ms dhoni

It's not going to be easy for West Indies, especially against India who are a top side and undoubtedly the favourites in the tournament. But, in cricket you never know anything can happen on a day so we are up for it. The players are aware of how important this game is and we will be going all out to win this game

క్రిస్ గేల్ తో టీమిండియాకు ప్రమాదమే

Posted: 03/02/2015 01:15 PM IST
Richardson warns india against chris gayle

ఎలాంటి అంచనాలు లేకుండా ప్రపంచ కప్ సమరంలోకి అడుగుపెట్టిన టీమిండియా అద్దరగొడుతోంది. ఈ సీజన్ లో ఫేవరెట్ గా నిలిచిన టీం లను మట్టికరిపిస్తు, తన సత్తా చాటుతోంది టీమిండియా. అందరు కలిసి ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు మన ఆటగాళ్లు. ఒక్కరంటే ఒక్కరు అని అనుకునే దగ్గరి నుండి అందరూ బాగా ఆడుతున్నారు అనే దాకా వచ్చారు. బ్యాటింగ్ లో మాత్రమే భారత్ దిట్ట అనే మాటను పక్కకు నెట్టుతున్నారు. బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటి దాకా ఒక్క క్యాచ్ కూడా వదలని టీం ఏమన్నా ఉందీ అంటే అది టీమిండియానే. ఇప్పుడున్నంతలా టీమిండియా ఎప్పుడూ కనిపించలేదు. వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాను రిచర్డ్ సన్ హెచ్చరిస్తున్నారు.

క్రికెట్ లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అప్పటి దాకా ఆడని ఆటగాడు హఠాత్తుగా అదరగొట్టొచ్చు. గత మ్యాచ్ లో మంచి పర్ఫామెన్స్ తో రెచ్చిపోతున్నాడు క్రిస్ గేల్ .
క్రికెట్ సమరంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న వెస్టిండిస్ ఆటగాడు క్రిస్ గేల్. ఓ మ్యాచ్ లో కాస్త నెమ్మదించినట్లు కనిపించినా, తరువాతి మ్యాచ్ లో చెలరేగి ఆడి అంచనాలకు అందకుండా ఉంటారు. ఎప్పుడు చెలరేగి ఆడతాడో తెలియని క్రిస్ గేల్ తో జాగ్రత్తగా ఉండండి అంటు భారత ఆటగాళ్లను హెచ్చరిస్తున్నారు టీమిండియా మేనేజర్ రిచర్డ్ సన్.
 ఒక్క క్రిస్ గేల్ మాత్రమే కాదు  స్మిత్, డెవిలియర్స్ లాంటి వారి వల్ల టీం ఇండియాకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్, సౌతాఫ్రికా లాంటి దేశాలను మట్టి కరిపించిన టీమిండియా మంచి జోరుమీదుందని, కానీ రానున్న మ్యాచ్ లపై జాగ్రత్త అవసరమని అన్నారు. క్రిస్ గేల్, ఎబి డెవిలియర్స్ ఇద్దరూ మేటి ఆటగాళ్లని, వారు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగలరని అన్నారు. వారు గనక రెచ్చిపోతే టీమిండియాకు ఆ రోజు బ్యాడ్ డే గా నిలుస్తుందని రిచర్డ్ తెలిపారు. కాబట్టి టీమిండియా వెస్టిండిస్ గురించి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అంటున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Richardson  chris Gayle  West Indies  AB de Villiers  world cup 2015  soute  team india  ms dhoni  

Other Articles