New zealand beat australia by one wicket

New Zealand beat Australia by one wicket. New Zealand versus Australia, New Zealand vs Australia, Mitchell Starc, Kane Williamson, Trent Boult, ICC Cricket World Cup 2015, world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, AustraliaCWC 2015, Live Scores, Live Updates, New Zealand, New Zealand CWC 2015, Sports, World Cup Live

New Zealand survived a late collapse to beat Australia by one wicket in a thrilling World Cup Pool A game.

అతిధ్య జట్ల మధ్య పోరులో గెలుపోందిన కివీస్

Posted: 02/28/2015 07:45 PM IST
New zealand beat australia by one wicket

క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా వన్డే వరల్డ్ కప్ లో భాగంగా రెండు అతిధ్య జట్లు న్యూజిలాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అసీస్ పోరాడి ఓడగా, న్యూజీలాండ్ చమటోడ్చి గెలిచింది. అసీస్ విధించిన నిర్ధేశిత లక్ష్య చేధనను కివీస్ ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. తొలుత ఆసీస్ ను 151పరుగులకే కివీస్ ఆటగాళ్లు ఆలౌట్ చేస్తే.. తరువాత బ్యాటింగ్ దిగిన కివీస్ కు ఆసీస్ బౌలర్లు చక్కులు చూపించారు. బౌలింగ్ ఫిచ్పై అందులోనూ బలెట్ వేగంతో దూసుకుపోయే బంతులు చూసేందుకు అధ్యంతం బౌలర్లల మధ్య సాగిన పోరును తలపించింది.
 
అసీస్ నిర్ధేశించిన 151 పరుగుల లక్ష్య ఛేదనలో ఆద్యంతం తడబడిన కివీస్ చివర్లో తేరుకుని ఆసీస్ కు గెలుపును దూరం చేసింది. మెక్ కల్లమ్ పెవిలియన్ కు చేరిన అనంతరం న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా ఆసీస్ బాటలో పయనించినట్టు కనబడ్డారు. కివీస్ ఆటగాళ్లలో రాస్ టేలర్(1), ఎలియట్(0), కోరీ అండరసన్(26), లూక్ రోంచీ (6), వెటోరీ(2) వరుసగా పెవిలియన్ చేరడంతో కివీస్ కష్టాల్లో పడింది.  అయితే ఆదిలో ఓపెనర్ బ్రెండెన్ మెక్ కల్లమ్(50; 24 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) దూకుడుగా ఆడటంతో పాటు, విలియమ్స్ సన్(45 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఆకట్టుకోవడంతో కివీస్ ను విజయం వరించింది.
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు క్రికెటర్లు కూడా కివీస్ బౌలర్లు విసిరిన బంతులకు విలవిల్లాడారు. ఆసీస్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ లు ధాటిగానే ఆరంభించారు. అయితే 30 పరుగుల వద్ద ఆసీస్ ఫించ్(14) ఔటైన తరువాత.. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. డేవిడ్ వార్నర్(34), షేన్ వాట్సన్(23),మైకేల్ క్లార్క్ (12), హాడిన్(43) పరుగులు మినహా ఎవరూ రాణించలేదు. ఒకదశలో 106 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్ ను హాడిన్ ఆదుకున్నాడు. 10 వ వికెట్ కు హాడిన్-కమ్మిన్స్ లు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆసీస్ 32.2 ఓవర్లలో 151పరుగులు చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  New Zealand  Australia  

Other Articles