Srilanka won with 92 runs against bangladesh

srilanka won against bangladesh, srilanka won the match against bangladesh, ICC Cricket World Cup 2015, srilanka versus bangladesh, srilanka vs bangladesh, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, virat kohli, Cricket, CWC 2015, bangladesh, bangladesh CWC 2015, Live Scores, Live Updates, srilanka, srilanka cwc 2015, Sports, World Cup Live

Sri Lanka cricketers sangakkarra and dilshan bounce back into form against bangladesh

పసికూనలపై విరుచుకుపడిన లంకేయులు

Posted: 02/26/2015 07:31 PM IST
Srilanka won with 92 runs against bangladesh

ప్రపంచ క్రికెట్ టార్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో ఇద్దరు కీలకమైన ఆటగాళ్లు అద్భుతంగా ఫామ్ లోకి వచ్చారు. అస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గౌండ్ర్స్ లో జరిగిన మ్యాచ్ లో పసికూనాలు బంగ్లాదేశ్ పై శ్రీలంక ఘన విజయం సాధించింది. ఇవాళ్టి మ్యాచ్ తో 400 వన్డేల క్లబ్ లో అడుగుపెట్టిన సంగక్కర్ సహా దిల్షాన్ తిలకరత్నే లిద్దరూ అద్భుతంగా రాణించి సెంచరీలు జోడించడంతో. శ్రీలంక విజయం నల్లేరుపై నడకలా సాగింది.

మలింగ.. లక్మల్.. మ్యాథ్యూస్.. ఈ ముగ్గురికీ తోడు పెరీరా, దిల్షాన్, హెరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్ ను ఎదుర్కొవడంలో విఫలం చెందిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో తొలి పది ఓవర్లలో జోరుగానే సాగించినా.. ఆ తరువాత క్రమంగా విక్కెట్లను పోగొట్టకుని కష్టాలలో పడింది. దీంతో ప్రపంచకప్ గ్రూప్ ఏ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంకకు 92  పరుగుల ఘనవిజయం సాధించింది. 333 పరుగుల భారీ లక్ష్యన్ని ఛేదించేందుకు బరిలో దిగిన బంగ్లా.. లంక బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో పూర్తిగా తడబడింది. 47 ఓవర్లు ఆడిన బంగ్లా కేవలం 240 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. షబ్బీర్ రహమాన్ ఆఫ్ సెంచరీ (53) సాధించాడు. షకీర్ అల్ హసన్ 46 పరుగులతో రాణించారు. రహీమ్ 36, షబ్బీర్ రహమాన్ 42 పరుగులు చేశారు.

అంతకుముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 332 పరుగుల భారీ స్కోరు సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లపై లంకేయులిద్దరూ విరుచుకుపడ్డారు. దిల్షాన్ 161 పరుగులు చేసి.. శ్రీలంక తరఫున ప్రపంచకప్ లో సరికోత్త రికార్డును నెలకొల్పాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచకప్ లో దిల్షాన్ రికార్డు నెలకొల్పాడు. అటు సంగక్కర కూడా బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కులు చూపించాడు. 155 బంతులు ఎదుర్కొన్న సంగక్కర 105 పరుగులుచేసి నాట్ ఔట్ గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో రూబెల్ హుస్సేన్ ఒక్క వికెట్ తీశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  srilanka  bangladesh  

Other Articles