ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ మైదానంలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లోఐర్లాండ్ రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 278పరుగులు చేయగా...లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడిన ఐర్లాండ్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసి విజయం సాధించింది. ప్రత్యర్థి యూఏఈ నిర్దేశించిన 279 పరుగుల విజయ లక్ష్యం ఐర్లాండ్ చాలానే శ్రమించింది. 25.2 ఓవర్లలో ఐర్లాండ్ 97 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి తడబడింది. కాగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విల్సన్(80) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆయనకు తోడు కెవిన్ ఓబ్రైన్ కూడా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తూ బంతులను బౌండరీలకు తరలిస్తూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఓబ్రైన్ కేవలం 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 50 పరుగులు చేశాడు. యూఏఈ బౌలర్లు చివర్లో పుంజుకుని కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వరుసగా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయారు. యూఏఈ బౌలర్లలో మహ్మద్ నవీద్ 2, గుర్గే 1, జావేద్ 3, మహ్మద్ 2 వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 131 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ అన్వర్ తనదైన శైలిలో ఆడుతూ కేవలం 79 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 100 పరుగులు పూర్తి చేసి ప్రపంచకప్‌లో యూఏఈ తరఫున తొలి శతకం నమోదు చేశాడు. అంతేకాకుండా ఏడో వికెట్‌కు జావెద్(42)తో కలిసి ఏకంగా 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ స్కోరు అందించగలిగాడు. ఓపెనర్ అంజాద్ అలి(45), ఖుర్రం ఖాన్(36) బ్యాట్‌తో రాణించడంతో యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో సోరెన్సెన్ 2, అలెక్స్ 2, స్టిర్లింగ్ 2, కెవిన్ ఓబ్రైన్ 2 ,డాక్రెల్ ఒక వికెట్ తీశాడు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more