Chris gayle creates records withs odi double century

Chris Gayle, Chris Gayle double century, Chris Gayle double hundred, gayle double ton, West Indies v Zimbabwe, ICC Cricket World Cup 2015, Chris Gayle double century v Zimbabwe, world cup westindies stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, chris gayle, Cricket, CWC 2015, Live Scores, Live Updates, west indies CWC 2015, Sports, World Cup Live

Chris Gayle scored first ever fatest double century in a World Cup and also the first West Indies batsmen.

ప్రపంచకప్ లో క్రిస్ గేల్ రికార్డుల పంట..

Posted: 02/24/2015 04:27 PM IST
Chris gayle creates records withs odi double century

వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ పరుగుల సునామీ సృష్టించాడు. ప్రపంచ కప్లో జంబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే బాలర్లకు ముచ్చమట్టలు పట్టించి దండయాత్రను కోనసాగించాడు. ప్రపంచ కప్ లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. తొలి డబుల్ సెంచరీగా సాధించిన వెస్టీండీస్ బ్యాట్స్మన్గా గేల్ రికార్డు సృష్టించాడు. అల్ బాల్స్ లీడ్స్ టు బౌండరీస్ అన్నట్లుగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

కాన్‌బెర్రా మనూకా ఓవెల్‌లో పరుగుల సునామీకి స్టేడియంలోని అభిమానులు కేరింతలు కోట్టారు. గేల్ కొట్టిన ఫోర్లు, సిక్స్‌ల జడివానను ప్రత్యక్షంగా వీక్షించామని అనుభూతులను అభిమానులు పంచుకుంటున్నారు. కొంత కాలంగా ఫామ్ లో లేక అనేక విమర్శలను ఎదుర్కోంటున్న గేల్.. జింబాబ్వేతో జరిగిన వన్డేలో తిరిగి ఫామ్ లోకి రావడం తమ జట్టుకు కలసివస్తుందని వెస్టీండీస్ జట్టు అకాంక్షిస్తుంది. ప్రత్యర్థుల విజయావకాశాలను ఒంటి చేత్తో శాసించగల బ్యాంటింగ్ దురంధరుడు 10 ఫోర్లు.. 16 సిక్స్‌లతో ప్రపంచ కప్ లో అత్యధిక స్కోరును సాధించన తొలి క్రికెటర్ గా ఘనతను సాధించాడు. వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించడమే కాకుండా... ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. 106 బంతుల్లో సెంచరీని సాధించిన గేల్.. ఆ తరువాత ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. కేవలం 36 బంతుల్లో మరో సెంచరినీ నమోదు చేసి తన విధ్వంసం స్థాయి ఎట్టిదో ప్రత్యర్దులకు చూపాడు.

క్రిస్‌గేల్ రికార్డులు

* ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు (215) చేసిన తొలి ఆటగాడు. (తర్వాతి స్థానాల్లో కిరిస్టన్(188*), గంగూలీ (183)లు ఉన్నారు.)

* వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు(215) చేసిన మూడో ఆటగాడు.(తొలి రెండు స్థానాల్లో రోహిత్‌శర్మ(264), సెహ్వాగ్ (219) ఉన్నారు.)

* టీ20లో 100 పరుగులు, వన్డేల్లో 200 పరుగులు, టెస్టుల్లో 300 పరుగులు చేసిన ఒకే ఒక్కడు క్రిస్‌గేల్.

* జింబాబ్వేపై.. శామ్యూల్స్‌తో కలిసి అత్యధిక పరుగుల(372) భాగస్వామ్యం నెలకోల్పాడు. ( ద్రావిడ్,  సచిన్ ల పేరిట ఉన్న 331 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు).

* అత్యంత వేగంగా 200 పరుగుల లక్ష్యాన్ని చేరడంలో వీరేందర్ సెహ్వగ్ పేరిట వున్న రికార్డును తిరగరాశాడు. వీరేంద్ర సేహ్వాగ్ 140 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించగా, గేల్ 138 బంతుల్లోనే ఈ రికార్డును చేరాడు.

* వన్డేలలో అత్యధిక సిక్స్ లు సాధించిన సేహ్వాగ్ రికార్డును కూడా గేల్ సమం చేశాడు. 16 సిక్స్ లతో బింజాబ్వే బౌలర్లకు వణుకు పుట్టించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  Gayle record  Zimbabwe  West Indies  

Other Articles