South africa cricket team slow over rate icc fine on players

icc world cup 2015, south africa cricket team, india vs south africa match, south africa slow over rate, south africa captain de villiers, south africa cricket players

south africa cricket team slow over rate icc fine on players : International cricket council fine on south africa cricket players for slow over rate.

సౌతాఫ్రికాకు మరో షాక్.. వార్నింగ్ ఇచ్చిన ఐసీసీ!

Posted: 02/23/2015 04:19 PM IST
South africa cricket team slow over rate icc fine on players

వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా మెల్ బోర్న్ లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయిన దక్షిణాఫ్రికా జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఓడిపోయి తీవ్ర ఆవేదనలో మునిగిపోతున్న తరుణంలో.. సౌతాఫ్రికాకు ఐసీసీ మొట్టికాయ వేసింది. దీంతో ఆటగాళ్లు కాస్త నిరాశగా వున్నారని సమాచారం!

ఆదివారం ఇండియాతో తలపడిన సౌతాఫ్రికా.. స్లో ఓవర్ రేటుతో బౌలింగ్ చేసినందుకు అధికారులు సఫారీ ఆటగాళ్లపై జరిమినా విధించారు. నిర్దేశిత సమయానికి ఒక ఓవర్ ను తక్కువగా వేయడంతో.. ఆ జట్టు కెప్టెన్ డివిలియర్స్ కు అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఇతర ఆటగాళ్లపై 10 శాతం జరిమానా విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అంతేకాదు.. ఈ వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్ లోగా దక్షిణాఫ్రికా మరోసారి స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ వేస్తే.. కెప్టెన్ డివిలియర్స్ పై ఒక మ్యాచ్ ఆడకుండా సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయి. అలాగే ఆటగాళ్లపై మరింత జరిమానా విధించే సూచనలున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc world cup 2015  south africa cricket team  cricketer de villiers  

Other Articles