Anil kumble to be inducted into the icc cricket hall of fame

anil kumble into icc cricket hall of fame, anil kumble to be inducted into hall of fame, indian spinner anil kumble, icc cricket hall of fame

Indian spinner anil kumble to be inducted into the icc cricket hall of fame

అనీల్ కుంబ్లేకు అరుదైన గౌరవం

Posted: 02/19/2015 08:46 PM IST
Anil kumble to be inducted into the icc cricket hall of fame

భారత మాజీ వైస్ కెప్టెన్ అనిల్ కుంబ్లే కు అరుదైన గౌరవ దక్కనుంది. త్వరలో ఈ మాజీ లెగ్ స్పిన్నర్ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్  లో సభ్యత్వం స్వీకరించనున్నారు. వన్డే వరల్డ్ కప్ లో ఆదివారం జరుగనున్న టీమిండియా -దక్షిణాఫ్రికా ల మ్యాచ్ అనంతరం కుంబ్లే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యత్వం లభించనుంది. ఈ తాజా ఎంపికతో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోని సభ్యులు సంఖ్య 77 కు చేరనుంది. అంతకుముందు ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో భారత్ నుంచి చోటు దక్కిన వారిలో బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ లు ఉన్నారు.
 
ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న అనిల్ కు గత రికార్డుల ఆధారంగా ఈ గౌరవాన్ని ఇవ్వనున్నారు. టెస్టుల్లో మూడో అత్యధిక వికెట్లు(619) తీసిన బౌలర్ గా కుంబ్లే రికార్డు సాధించి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు 1999వ సంవత్సరంలో న్యూఢిల్లీలో పాకిస్థాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా కుంబ్లే రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డులను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. అనిల్ కు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించనుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Kumble  ICC Cricket Hall of Fame  

Other Articles