Michael clarke to miss england clash in world cup

michael clarke to miss england clash, michael clarke to miss first match in world cup, cricket-world cup-2015, India, Australia, icc world cup opening ceremony, icc world cup live updates, world cup opening ceremony songs, world cup opening ceremony performences, world cup opening ceremony reactions, world cup opening ceremony video, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills,

australian skipper michael clarke to miss england clash in world cup

మైకిల్ క్లార్ కు షాక్.. తొలి మ్యాచ్ లో ఔట్

Posted: 02/12/2015 11:38 PM IST
Michael clarke to miss england clash in world cup

ఊహించినట్టుగానే వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఫిబ్రవరి 14వ తేదీన ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. ఇందులో భాగంగానే నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షలో క్లార్క్ విఫలం చెందాడు. దీంతో ఇంగ్లండ్ తో అతను సేవలను కోల్పోతున్నట్లు కోచ్ డారెన్ లీమన్ ప్రకటించాడు.
 
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 21వ తేదీన బంగ్లాదేశ్ తో జరిగే రెండో మ్యాచ్ కు క్లార్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని లీమన్ తెలిపాడు.  క్లార్క్ వేగంగా కోలుకుంటున్నందున కీలక మ్యాచ్ లకు వస్తాడని లీమన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : michael clarke  cricket-world cup-2015  India  Australia  

Other Articles