Jadeja sues rajkot newspaper for defamation

Cricketer Ravindra Jadeja, Rajkot Evening Newspaper, defamation suit, satish mehta, editor and owner of aabtak, jadeja seeks damages for Rs. 51 crore, aabtak paper drags jadeja name, jadeja land grabbing case, jadeja extortion case, Ravindra Jadeja, Ravindra Jadeja sues newspaper, Ravindra Jadeja defamation case, Aabtak, land grabbing, extortion, Ravindra Jadeja links Bali Dangar, jadeja business partner business partner Jenesih Ajmera

Cricketer Ravindra Jadeja has sued a Rajkot-based evening newspaper for dragging his name into a land grabbing and extortion case under investigation.

పత్రికపై రవీంద్ర జడేజా పరువునష్టం దావా..

Posted: 01/21/2015 01:48 PM IST
Jadeja sues rajkot newspaper for defamation

భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను అనవసరంగా వివాదాల్లోకి లాగిన ఓ పత్రికా సంపాదకుడు ఇబ్బందుల్లో పడ్డాడు. రవీంద్ర జడేజాను కబ్జాదారుడిగా, దగాకోరుగా అభివర్ణిస్తూ.. రాజ్ కోట్ సాయంకాలపు దినపత్రిక అబ్ తక్ సంపాదకుడు, యజమాని సతీస్ మోహతా తన పత్రికలో ఒక కథనాన్ని ప్రచురించారు. గత ఏడాది నవంబర్ 20న ఈ కథనం ప్రచురితమైంది. జడేజాతో పాటు ఆయన వ్యాపార భాగస్వామి జినీష్ అజ్మీరాకు స్థానికంగా భూకబ్జాదారుడైన బాలీ దాంగర్ తో సంబంధాలు వున్నాయని, దీంతో వారు కూడా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కథనాన్ని అబ్ తక్ పత్రిక ప్రచురించింది

ఈ కథనంపై స్పందించిన రవీంద్ర జడేజా తనను భూ కబ్జాదారుడిగా, దోపిడీదారుడిగా చిత్రీకరించి ఎందుకు కథనాన్ని ప్రచురించారని అబ్ తక్ దినపత్రిక కార్యాలయానికి ఆశ్రయించారు. అక్కడి సరైన స్పందన కరువవ్వడంతో ఆయన రాజ్ కోట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జడేజా తరపున ఆయన న్యాయవాది హిరెన్ భట్.. రాజ్ కోట్ న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేశారు. జడేజా పిటీషన్ ను విచారణకు స్వీకరించిన రాజ్ కోట్.. ప్రిన్సిఫల్ సీనియర్ సివిల్ జడ్జి పీబి పార్మర్  వచ్చే నెల 4న పత్రికా సంపాదకుడిని కోర్టులో హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.

అబ్ తక్ పత్రికలో రాసినట్లు జడేజాకు భూకబ్జాదారుడు బాలీ దంగర్ తో సంబంధాలు లేవని, తాను ఇప్పటి వరకు అతన్ని చూడలేదని భట్ చెప్పుకోచ్చారు. కాగా జడేజా వ్యాపార భాగస్వామిగా పత్రిక పేర్కొన్న అజ్మేరా ఏ వ్యాపారంలోనూ భాగస్వామి కాదని చెప్పుకోచ్చారు. ఇలాంటి తప్పుడు కథనంతో జడేజా పరువుకు భంగం కలిగించినందుకు గాను రూపాయలు 51 కోట్లు తనకు నష్టపరిహారంగా చెల్లించాలని భట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే నవంబర్, డిసెంబర్ మాసాలలో తాము పత్రిక పంపాదకుడికి లీగల్ నోటీసులు పంపామని, వాటిపై ఆయన స్పందించనందునే తాము కోర్టను ఆశ్రయించామని హిరెన్ భట్ చెప్పుకోచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravindra jadeja  aabtak  defamation suit  

Other Articles