Bcci accused of misappropriating president pms photos

bcci accused of misappropriating photos, bcci accused of president pranab mukharjee photo, bcci accused of PM narendra modi photo, president pranab mukharjee, Prime Minister Narendra modi, BCCI, controversy, bihar cricket council, Aditya varma,

bcci accused of misappropriating president pms photos

వివాదాల చట్రంలో చికుకున్న భారత క్రికెట్ బోర్డు

Posted: 01/11/2015 09:27 PM IST
Bcci accused of misappropriating president pms photos

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలు మరో వివాదంలో ఇరుకున్నారు. బీసీసీఐ వార్షిక నివేదికలో ఏకంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలను ముద్రించారు. ఈ విషయమై వివాదం రేగడంతో పొరపాటుగా ముద్రించినట్టు చెప్పడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ ఈ విషయాన్ని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. బీసీసీఐపై తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు.

ఎలాంటి అనుమతి తీసుకోకుండా రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలను బీసీసీఐ నివేదిక కవర్ పేజీపై ముద్రించారని వర్మ ఆరోపించారు. బీసీసీఐ 87 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ వార్షిక నివేదికలో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలను ముద్రించలేదని వర్మ పేర్కొన్నారు. బోర్డు చౌకబారు ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి గతంలో వర్మ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ను కోర్టుకు లాగారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  controversy  president PMs photos  

Other Articles