Virender sehwag greetings team india mohammad azharuddin news

virender sehwag news, mohammad azharuddin news, 2015 world cup news, india world cup team, 2015 world cup team india, team indian members, virender sehwag latest greetings

virender sehwag greetings team india mohammad azharuddin news : batsman virender sehwag best wishes for india team. but other side mohammad azharuddin fires on selectors

టీమిండియాకు సెహ్వాగ్ గ్రీటింగ్స్.. మాజీ కెప్టెన్ అజహర్ ఆందోళన!

Posted: 01/10/2015 01:00 PM IST
Virender sehwag greetings team india mohammad azharuddin news

టీమిండియా ఫాస్ట్ బ్యాట్స్’మేన్ విరేందర్ సెహ్వాగ్.. ఈసారి జరగబోయే 2015 ప్రపంచ వరల్డ్’కప్’కు ఎన్నిక కాలేదని అందరికీ తెలిసిందే! మొదట్లో తాను 30 మంది సెలక్టర్లలో సెలెక్ట్ అవుతాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారని కానీ.. చివరికీ అవి అడియాశలు అయ్యాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఈ ఆటగాడు.. కొన్నాళ్లపాటు ఆ దు:ఖంతోనే మీడియా ముందుకు రాలేదు. అయితే.. తాజాగా ఇప్పుడు ఆ బాధ నుంచి కోలుకుని.. ఇండియా జట్టుకు గ్రీటింగ్స్ అందజేస్తున్నాడు.

వచ్చే నెలలో ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తమ టైటిల్ నిలబెట్టుకోవాలంటూ సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపాడు. తప్పకుండా ఇండియా గెలుస్తుందన్న నమ్మకాయన్ని వ్యక్తం చేశాడు. స్థానికంగా జరిగిన ప్రపంచకప్ ట్రోఫీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘డిఫెండింగ్ చాంపియన్‌గా మన జట్టు బరిలోకి దిగబోతోంది. ఈ టోర్నీలోనూ బాగా ఆడి టైటిల్ నిలబెట్టుకుని.. భారతీయులకు అమితానందం కలిగించాలి’ అని విషెస్ తెలిపాడు.

మరోవైపు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్.. ప్రపంచకప్’లో ఆడనున్న ఇండియా జట్టు బౌలింగ్ విభాగంపై ఆందోళన వ్యక్తం చేశాడు. చండీగఢ్‌లో తన క్రికెట్ అకాడమీని ప్రారంభించిన ఆయన ఆ వేదికపైనే జట్టు గురించి మాట్లాడుతూ.. ‘15 మందితో కూడిన ప్రపంచకప్ ఇండియా జట్టు బాగానే ఉంది. కానీ.. బౌలింగ్ విభాగం ఏమేరకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా వుంది. ముక్కోణపు సిరీస్ కూడా ముగిశాక  ఏమేరకు ప్రత్యర్థులకు సవాల్ విసరగలరో తెలిసిపోతుంది’ అని సూచించారు. అయితే.. జట్టు ఎంపికలో సీనియర్ ఆటగాళ్ల పట్ల సెలక్టర్లు కఠినంగా వ్యవహరించారని అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles