Sachin tendulkar soon turns hero on indian silver screen

Sachin Tendulkar, sachin tendulkar soon turns hero, Rajya sabha MP Sachin Tendulkar, member of parliament Sachin Tendulkar, sachin on indian silver screen, sachin acting as hero in bollywood movie, sachin playing role of himself in movie, sachin latest updates, sachin autobiography, sachin playing it my way, sachin tendulkar latest updates, sachin tendulkar latest news, sachin tendulkar photos

Sachin Tendulkar, who recently released his autobiography, 'Playing it my Way', will now be seen on the big screen, playing the role of himself in a feature film.

హీరోగా త్వరలో వెండితెరపై మెరవనున్న సచిన్ టెండుల్కర్..

Posted: 01/08/2015 01:25 PM IST
Sachin tendulkar soon turns hero on indian silver screen

సచిన్ టెండుల్కర్.. భారత క్రికెట్ అభిమానుల పాలిట ధైవంగా మారిన ఇటీవల భారత బ్యాటింగ్ దిగ్గజం త్వరలోనే వెండి తెరపై మెరవనున్నారు. భారత రత్న అవార్డును సొంతం చేసుకున్న ఏకైక క్రీడాకారుడిగా కీర్తి గడించిన సచిన్.. పరుగుల పందేరాన్ని విడచి రాజకీయ నేతగా పార్లమెంటులోకి రాజ్యసభ సభ్యుడి హోదాలో అడుగుపెట్టారు. అయితే త్వరలోనే ఆయన హీరో అవతారం ఎత్తనున్నారు. ఇన్నాళ్లు తాను బ్యాటింగ్ దిగిన సందర్భంలో స్టేడియం గ్యాలరీల నుంచి ఫోర్, సిక్స్ అంటూ అభిమానుల అరుపులు ప్రతిధ్వనించేవి..  కానీ ఇకపై లైట్స్, కెమెరా, యాక్షన్ అనే దర్శకుల పదాలు వినబడున్నాయి. నిజమేనా అని సందేహిస్తున్నారా..?

నిజమే.. సచిన్ టెండుల్కర్.. తన క్రికెట్ అనుభావాలను స్వయంగా పదాలుగా మార్చి.. వాటిని పుస్తకంగా కూర్చి రచించిన స్వియానుభాల పుస్తకం ప్లేయింగ్ ఇట్ మై వే అనే పుస్తకాన్నే చిత్రంగా మలచనున్నారు. ఇందులో తన పాత్రను తానే నటించేందుకు కూడా సచిన్ అంగీకరించారు. తన పాతికేళ్ల క్రికెట్ జీవన ప్రయాణంపై ముంబై చిత్ర నిర్మాణ సంస్థ 200 నాటౌట్ సంస్థ చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇందుకోసం 200 నాటౌట్ సంస్థ సచిన టెంటుల్కర్ బ్రాండ్ సహా వాణిజ్య వ్యవహారాలను చూసుకుంటున్న రల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ తో ఒప్పందాలను కూడా చేసుకుందని సమాచారం. సినిమాలలో అవసరమైన పలు క్రికెట్ మ్యాచ్ లకు సంబంధించిన వీడియో ఫూటేజీని కూడా ఇప్పటికే ఈ సంస్థ పలు దేశాల క్రికెట్ బోర్డుల నుంచి సమకూర్చుకున్నట్లు సమాచారం.  ఈ చిత్రాని్న లండన్ రచయిత జేమ్స్ ఎర్క్ కైన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

సచిన్ టెండుల్కర్ బాల్యం, క్రికెట్ పై తనకు గల ఆసక్తి, తాను క్రికెట్ లోకి ప్రవేశించిన విధానం. అంచెలంచెలుగా ఎదిగిన వైనం తదితరాలతో పాటు సచిన్ రాసిన స్వియ చరిత్రను కూడా పరిగణలోకి తీసుకుని దర్శకుడు ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇందులో సచిన్ వివాహానికి సంబంధించిన పలు సన్నివేశాలను కూడా పోందుపర్చనున్నట్లు సమాచారం. త్వరలోనే సెట్లపైకి రానున్న ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా 2000 సినిమా ధియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర నిర్మణ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  playing it my way  indian silver screen  

Other Articles