Dhoni absence gives australia advantage says warner

dhoni absence gives advantage, dhoni absence gives australia advantage, indian skipper dhoni retiered, dhoni retired from test cricket, australia opener david warner, indian skipper mahendra singh dhoni , dhoni latest news, dhoni latest updates,

mahendra singh dhoni absence gives australia dded advantage says aussies opener david warner

ధోని లేకపోవడం అస్ట్రేలియాకు లాభిస్తుంది..

Posted: 01/04/2015 09:47 PM IST
Dhoni absence gives australia advantage says warner

నాలుగో టెస్టులో విజయం కోసం ఉవ్విళ్లూరుతున్న అస్ట్రేలియా టిమ్ ఓ వైపు భారత టెస్టు జట్టు యువ కాప్టెన్ విరాట్ కోహ్లీలో బోరింగ్ క్రికెట్ ఆడాల్సి వస్తుందన్న స్లెడ్జింగ్ చేస్తూనే.. మరో వైపు భారత టెస్టు జట్టులో కెప్టెన్ లేక పోవడం కూడా తమకు లాబిస్తుందని ఓ రకమైన ఒత్తడికి భారత్ ను గురిచేస్తుంది. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి వైదొలగడం తమకు లాభిస్తోందని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. టెస్టుల్లో విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోనీ సిడ్నీలో జరిగే టెస్ట్ మ్యాచ్ కు ముందే వీడ్కోలు చెప్పడం ఆసీస్ కు కలిసొస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

'ధోనీ టీం గురించి చాలా ఎక్కువగా ప్రణాళికలు రచిస్తాడు. అవి ఎప్పుడూ కూడా ప్రత్యర్థికి సవాల్ గా ఉంటాయి.మ్యాచ్ కోల్పోయే సమయంలో కూడా ధోనీ జట్టును కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి' అని వార్నర్ తెలిపాడు. ప్రస్తుతం ధోనీ లేకపోవడం మాత్రం ఖచ్చితంగా ఆసీస్ కు లాభిస్తోందన్నాడు. టీమిండియాకు బాధ్యతలు చేపట్టనున్న విరాట్ కోహ్లీ జట్టును ఏవిధంగా నడిపిస్తాడో వేచి చూడక తప్పదన్నాడు. కోహ్లీకి చాలా భవిష్యత్తు ఉన్నందున టీమిండియా కెప్టెన్సీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  david warner  team india  virat kohli  australia  

Other Articles