Dean jones hails virat kohli says he represents the new age india

virat kohli news, virat kohli career, india cricket team, india Test cricket team, india Test cricket team captain virat kohli, indian cricket players, india test series, mahendra singh dhoni, virat kohli controversy, india Test cricket team records, virat kohli records, dean jones, former Australian cricketer

Former Australian batsman Dean Jones has hailed India's new Test captain Virat Kohli as "king of world cricket" and has backed him to give the team more successes abroad.

విరాట్ కోహ్లీపై అసీస్ డీన్ జోన్స్ ప్రశంసలు.!

Posted: 01/02/2015 09:35 PM IST
Dean jones hails virat kohli says he represents the new age india

భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. అసీస్ బౌలర్ తీరుపై ఆయన బాహాటంగానే విమర్శించిన తరువాత భారత్ కు చెందిన మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నుంచి విమర్శలను ఎదుర్కోన్న విరాట్.. అస్ట్రేలియా క్రికెటర్ డీన్ జోన్స్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ‘ప్రపంచ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ ఒక కొత్త రాజు' అని, అతని నాయకత్వంలో భారత జట్టు మరిన్ని విజయాలను సాధిస్తుందని ఆకాంక్షించారు. ధోనీ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే నాల్గవ టెస్ట్ మ్యాచుకు భారత జట్టుకు విరాట్ కోహ్లీ సారథిగా వ్యవహరించనుండటంతో ఆయనను డీన్ జోన్స్ ప్రశంసలతో ముంచెత్తారు.

అస్ట్రేలియా సీరిస్ తరువాత కూడా భారత టెస్ట్ జట్టుకు కోహ్లీనే నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా వున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ.. తొలి, రెండో ఇన్నింగ్సుల్లో కలిపి రెండు శతకాలు నమోదు చేశాడు. భారత జట్టుకు సారథ్యం వహించే సత్తా కోహ్లీకే ఉందని ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న డీన్ జోన్స్ తెలిపాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా చాలా క్లిష్టమైనదని, ప్రపంచ ఆటల్లో అదొక డిమాండ్ ఉన్న హోదా అని చెప్పాడు. అస్ట్రేలియా దినపత్రిక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు రాసిన కాలంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నాడు.

భారత్ ప్రపంచ క్రికెట్‌లో శక్తివంతమైనదని, ఆర్థికంగా కూడా బలంగా ఉందని చెప్పాడు. కెప్టెన్సీ అనే ప్రత్యేక హోదాలో కొనసాగే వ్యక్తిపై అమితమైన బాధ్యతతోపాటు కొంత ఒత్తిడి ఉంటుందని డీన్సీ అన్నాడు. ప్రస్తుతం కోహ్లీ ప్రపంచ క్రికెట్‌కు కొత్త రాజుగా వ్యవహరించనున్నాడని తెలిపాడు. ఎంఎస్ ధోనీ.. విరాట్ కోహ్లీకి మధ్య చాలా తేడాలున్నాయని అభిప్రాయపడ్డాడు. ధోనీ కూల్ ఉంటే.. కోహ్లీకి దూకుడు ఎక్కువ అని అన్నాడు. కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు మరిన్ని విజయాలు నమోదు చేస్తుందని డీన్ జోన్స్ చెప్పాడు. భారత అభిమానులు కోహ్లీ లాంటి కెప్టెన్ కావాలని కోరుకుంటున్నారని తెలిపాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  virat kohli  team india  ms dhoni  india tour of australia 2014 15  sydney  

Other Articles