Mahendra singh dhoni retirement news controversy virat kohli sourav ganguly comments

mahendra singh dhoni, dhoni latest news, mahendra singh dhoni retirement, dhoni retirement news, dhoni virat kohli news, virat kohli captaincy news, sourav ganguly press meet, sourav ganguly comments, virat kohli latest photos, mahendra singh dhoni cricket career

mahendra singh dhoni retirement news controversy virat kohli sourav ganguly comments : the secret behind mahendra singh dhoni retirement has revealed that dhoni didn't like to play in virat captaincy. so that's why he gave retirement.

ధోనీ రిటైర్మెంట్ వెనుక అసలు రహస్యం గుట్టురట్టు!

Posted: 12/31/2014 04:26 PM IST
Mahendra singh dhoni retirement news controversy virat kohli sourav ganguly comments

భారతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ హఠాత్తుగా టెస్ట్ మ్యాచుల నుంచి రిటైర్’మెంట్ ప్రకటించడంతో అందరికీ షాక్ తగిలినట్లయ్యింది. దాదాపు 60 టెస్టులకు కెప్టెన్’గా వ్యవహరించిన ధోనీ.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మ్యాచులు ఓడిపోయిన కెప్టెన్’గా చెత్త రికార్డును సాధించాడు. పైగా.. ఇంగ్లాండులో జరిగిన టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఘోరపరాజయాన్ని ఎదుర్కోవడంతో అప్పటినుంచి ధోనీ కెప్టెన్సీ మీద ఎక్కువ విమర్శలు రావడం జరిగింది.

టీమిండియా అభిమానులతోబాటు మాజీ సీనియర్ ఆటగాళ్లు సైతం ధోనీని కెప్టెన్’గా తొలగించాలంటూ వాదనలు వినిపించారు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లోనూ మరింత దారుణంగా ఓడిపోవడంతో ఈసారి విమర్శలు మరింతగా పెరిగాయి. దాంతో ధోనీ ఇలా టెస్ట్ మ్యాచుల నుంచి తప్పుకున్నట్లు సమాచారం! అయితే తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం.. ధోనీ రిటైర్మెంట్ ఇవ్వడం వెనుక అసలు కారణం వేరే వుందని ప్రచారం కొనసాగుతోంది.

గతకొన్నేళ్లుగా విదేశీ గడ్డపై టీమిండియా వరుసగా విఫలమవుతుండటంతో ధోనీని టెస్టు కెప్టెన్సీగా తొలగించి.. కోహ్లీని ఎంపిక చేయాలంటూ సలహాలివ్వడం ప్రారంభించారు. ధోనీ సారథ్యం వీడితే.. కోహ్లీకి ఆ బాధ్యతలు అప్పగించాలని గవాస్కర్, గంగూలీ, ఇంకా ఇతరులు సూచించారు. దీంతో తనకంటే జూనియర్ అయిన కోహ్లీ సారథ్యంలో ఆడాల్సి వస్తుంది. అలా ఆడితే తన గౌరవ మర్యాదలు పూర్తిగా దెబ్బతింటాయనే భావనతోనే ధోనీ ఇలా టెస్టు క్రికెట్’కు స్వస్తి చెప్పాల్సి వచ్చిందని వాదనలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ధోనీ ఇంత హఠాత్తుగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని ఎవరూ ఊహించలేకపోయామని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ముఖ్యంగా గంగూలీ అయితే ఈ వ్యవహారంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సిరీస్ జరుగుతుండగానే ధోనీ తీసుకున్న నిర్ణయం షాక్’కు గురిచేసిందని అన్నాడు. కెప్టెన్సీ వదులుకోవడం మంచి నిర్ణయమేగానీ.. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం సరికాదని తెలిపాడు. ఏదైతేనేం.. ప్రస్తుతం ధోనీ రిటైర్మెంట్ వ్యవహారం మాత్రం ఇంకా తీవ్ర దుమారాన్ని రేపుతూనే వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles