India vs australia third test match third day update

India vs Australia test match, India vs Australia third test match, India vs Australia test match updates, India vs Australia third test third day score, India vs Australia score updates, Virat Kohli century in India vs Australia match, India vs Australia live updates, Australia score in Third test with india, indian cricket latest updates, australia cricket updates

India vs Australia third test match third day update : by the end of third day in third test match with Australia India have 462 runs for the loss of 8 wickets. virat kohli makes century and half century in third test match.

ముగిసిన మూడవ రోజు పోరు

Posted: 12/28/2014 01:13 PM IST
India vs australia third test match third day update

భారత్ - ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో మూడవ రోజు ఆట ముగిసింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా 8 వికెట్లు కోల్పోయి 462 పరుగులు చేసింది. ఇవాళ్టి ఆటలో కోహ్లీ, రహానే జట్టు స్కోరును రేసుగుర్రంలా పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి కంగారూలను ఖంగారు పెట్టారు. కొహ్లి తొలి శతకంన్నర పరుగులు చేయగా.., రహానే కూడా స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. నిలకడగా క్రీజులో ఉంటూ.., మంచి స్కోరును అందించారు. జట్టు స్కోరు 409 పరుగులుగా ఉన్నపుడు లియాన్ వేసిన బంతికి రహానే ఔట్ అయ్యాుడు. 171 బంతుల్లో 147 పరుగులు చేయగలిగాడు.

రహానే స్థానంలో వచ్చిన ధోని కోహ్లితో సరిగా సమన్వయం కొనసాగించలేదు. ఈ కారణంచే ధోని వచ్చిన తర్వాత కొహ్లి పరుగులు కాస్త తగ్గాయి. ఇదే సమయంలో జాన్సన్ వేసిన బంతికి కొహ్లి కొట్టిన షాట్ హడిన్ చేతికి దొరికింది. దీంతో 169 పరుగుల వద్ద కొహ్లీ ఔట్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇవాళ్టి ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. తొలి సెషన్ ముగిసే సమయానికి స్కోరు బోర్డులను పరిశీలిస్తే భారత్ ఆశలు సజీవంగా ఉన్నాయని చెప్పాలి. ఇదే సమయంలో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఆస్ట్రేలియా 530 పరుగులు చేసి బ్యాటింగ్ ను భారత్ కు అప్పగించింది. తొలి రెండు టెస్టుల గుణపాఠాలు నేర్చుకున్న టీమిండియా ఆటగాళ్లు.., తొలిరోజునే భారీ స్కోరు చేశారు. అయితే వికెట్లు టపాటపా పడిపోవటం బాధాకరం. ఇప్పుడిదే అంశం ఆందోళన కల్గిస్తోంది. ఎనమిది వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా మిగిలిన వారితో టార్గెట్ కంప్లీట్ చేస్తుందా.. లేక ఆసీస్ బౌలింగ్ కు బౌల్డ్ అవుతుందా అనేది అర్ధం కావటం లేదు. స్పిన్నింగ్ కు అనుకూలించే పిచ్ పై.., కంగారూల బౌలింగ్ ధాటిని తట్టుకుని మరీ., భారత ఆటగాళ్ళు సత్తా చాటారు. ఇది అభినందించాల్సిన విషయం.., కానీ సోమవారం ఏం మాయ చేస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లను చేజార్చుకున్న భారత్ కు ఈ టెస్ట్ కూడా పోయిందంటే పరాయి గడ్డపై అవమానమే మిగులుతుంది.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  Virat Kohli  Cricket Updates  

Other Articles