Difficult to surpass rohit sharmas 264 says brian lara

Brian Lara, Rohit Sharma, record One-day International, 264 runs, tough to break, kapil dev, v.v.richards, surpass

difficult to surpass rohit sharmas 264 says brian lara

రోహిత్ శర్మ రికార్డును తిరగరాయడం కష్టమే..

Posted: 11/20/2014 03:59 PM IST
Difficult to surpass rohit sharmas 264 says brian lara

భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వన్డేల్లో సృష్టించిన ప్రపంచ రికార్డు పట్ల వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా సంతోషం వ్యక్తం చేశారు. ఒక క్రికెటర్ గా తాను చాలా ఆనందపడుతున్నాన్నారు. వన్డేల్లో రోహిత్ శర్మ సృష్టించిన రికార్డును తిరగరాయడం కూడా కష్టమని లారా అభిప్రాయపడ్డాడు. గతవారం శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో సెహ్వాగ్(219) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కోట్టడం సంతోషించదగ్గ పరిణామమన్నాడు.

మాంచెస్టర్ లో ఇంగ్లండ్ మీద సర్ వివి రిచర్డ్స్ చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్ చూస్తూ తాము పెరిగామని లారా తెలిపాడు. అలానే అంతకు ముందు భారత్ క్రికెట్ మాజీ కెప్టన్ కపిల్ దేవ్ చేసిన అత్యధిక 175 పరుగుల రికార్డును చూసి భారత క్రికెటర్లు పెరిగివుంటారని అభిప్రాయపడ్డారు. కపిల్ దేవ్ రికార్డును సర్ వి వి రిచర్డ్స్ అధిగమించగా.. కాలక్రమేనా ఆ రికార్డులు చెరిగిపోయిందన్నాడు. వన్డేలో డబుల్ సెంచరీ సాధించడం సాధ్యమే అయినప్పటికీ రోహిత్ శర్మ సాధించిన రికార్డును బ్రేక్ చేయడం కష్టమేనని పేర్కొన్నాడు. ఇది ప్రత్యేకమైన ఇన్నింగ్స్ అని కొనియాడాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles