West indies cricket players take decision to leave india tour

west indies cricket team, west indies cricket board, west indies players association, dwayne bravo news, west indies india tour, west indies vs india matches, west indies leave india tour, india cricket team, india cricket board, india srilanka matches

west indies cricket players take decision to leave india tour

భారత్ పై విండీస్ తిరుగుబాటు.. కారణం?

Posted: 10/18/2014 01:44 PM IST
West indies cricket players take decision to leave india tour

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూలేని విధంగా ఒక అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. టీమిండియా జట్టుతో క్రికెట్ ఆడేందుకు భారత్ లో అడుగుపెట్టిన వెస్టిండీస్ జట్టు... మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితో వున్న కారణంగా అసలు మ్యాచులే ఆడకూడదని ఆ జట్టు ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. కొచ్చిలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ నుంచి ఇలా తిరుగుబాటును ప్రారంభించిన ఆ ఆటగాళ్లు.. ఎలాగోలా నాలుగు వన్డే మ్యాచులను ముగించారు కానీ.. ఐదో వన్డే ఆడేదిలేదంటూ తేల్చిపారేశారు. ఇంకా ఒక వన్డే, టీ20, మూడు టెస్టులు మ్యాచులు ఆడాల్సిన విండీస్ జట్టు... ఇలా అర్థంతరంగా భారత్ పర్యటన నుంచి నిష్ర్కమించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

కారణం :

ఈ ఏడాది సెప్టెంబర్ 19న విండీస్ బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు, ఇతర చెల్లింపులకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఈ విషయమై తమతో చర్చించకుండా ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేవెల్ హైండ్స్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం జరిగిందని... ఒకవేళ ఇది అమల్లోకి వస్తే తాము భారీగా నష్టపోతామంటూ జట్టు ఆటగాళ్లు కొచ్చిలో తొలి వన్డేకు ముందే నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ముందుగానే పరిష్కరించాలని ఆటగాళ్లు డిమాండ్ చేసినప్పటికీ... మ్యాచ్ బరిలోకి దిగినా ఇంకా పూర్తికాకపోవడంతో ఆటగాళ్లందరూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో వాళ్లందరూ ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హైండ్స్ రాజీనామా చేయాలంటూ బ్రేవో బృందం డిమాండ్ చేసింది. ఈ విషయంలో కలుగజేసుకోవాలని కూడా బోర్డుకు బ్రేవో లేఖ రాశాడు. అయితే తాను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీమానా చేసేది లేదని హైండ్స్ స్పష్టం చేశాడు. అలాగే బోర్డు అధికారులు కూడా ఈ విషయం మీద ఆటగాళ్లతో చర్చించకుండా నేరుగా ప్లేయర్స్ అసోసియేషన్‌తోనే తాము చర్చిస్తామని గురువారం చెప్పింది.  

దీంతో ఆగ్రహించిన ఆటగాళ్లు భారత్‌తో సిరీస్‌ను తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. నాలుగో వన్డేకు ముందే మ్యాచ్ ఆడకూడదని బ్రేవో బృందం పట్టుబడింది. దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మ్యాచ్ జరగడంపై అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ హోటల్‌కు వెళ్లి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆటగాళ్లతో పాటు రిచర్డ్సన్, ఆంబ్రోస్‌లతో కూడా వరుసగా మాట్లాడారు. ‘‘మ్యాచ్ లేకపోతే మాకు అవమానం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. వన్డే చూసేందుకు చాలా దూరంనుంచి అభిమానులు వస్తున్నారు. ఈ మ్యాచ్ జరగకపోతే వాళ్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతారు. తాను ఇంత చెప్పినా మ్యాచ్ నుంచి తప్పించుకోవాలనుకుంటే.. ఇక మీరు మా అతిథులు కారు.. మీకు మాకు సంబంధం లేదు.. మేమేమీ చేయలేం’ అని ఠాకూర్ అన్నట్లు సమాచారం. చివరకు చేసేదేమీ లేక బ్రేవో బృందం మ్యాచ్ ఆడటానికి ఒప్పేసుకుంది. కానీ తరువాత జరగబోయే మ్యాచ్ లను ఆడమని స్పష్టం చేస్తూ.. భారత్ పర్యటన నుంచి నిష్ర్కమించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles