Australian cricketer caught a special catch of batsman fawad in third oneday which goes viral

pakistan australia third oneday match, pakistan australia oneday series, batsman fawad, australian cricketer steven smith, pak ausis catch controversy

australian cricketer caught a special catch of batsman fawad in third oneday which goes viral

పాక్ - ఆసీస్ ల మధ్య చిచ్చురేపిన ‘‘క్యాచ్’’!

Posted: 10/14/2014 03:01 PM IST
Australian cricketer caught a special catch of batsman fawad in third oneday which goes viral

సాధారణంగా రెండు ప్రత్యర్థి జట్ల మధ్య అప్పుడప్పుడు విభేదాలు రావడం సహజమే కానీ... ఇక్కడో ఒక్క ‘‘క్యాచ్’’ పాక్ - ఆసీస్ జట్ల మధ్య పెద్ద దుమారాన్నే రేపింది. అసలు జరిగిన విషయం ఏమింటే.. ఆసీస్-పాక్ మూడో వన్డేలో ఎవరూ ఊహించని విధంగా ఓ ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్ పట్టిన క్యాచ్.. పెద్ద చర్చకు దారితీసింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ డోహర్టి వేసిన 18వ ఓవర్ ఐదో బంతికి బ్యాట్స్ మన్ ఫవాద్ ఆలమ్ (లెఫ్ట్ హ్యాండర్) అనూహ్యంగా ఔటయ్యాడు. అతనికి ఆఫ్ సైడ్ స్లిప్ లో వున్న స్మిత్... ఫవాద్ ఆడబోయే షాట్ ను ముందుగానే అంచనా వేసి.. వేగంగా వికెట్ కీపర్ ను దాటి... లెగ్ స్లిప్ కు వెళ్ళిపోయాడు. ఫవాద్ ప్యాడిల్ స్వీవ్ చేయగానే బంతి లెగ్ స్లిప్ వైపు గాల్లోకి లేవగా... దానిని స్మిత్ సునాయాసంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్యాట్స్ మన్ ఆలమ్ తోపాటు మైదనంలో వున్న అంపైర్లు, ప్రేక్షకులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

సాధారణంగా బ్యట్స్ మన్ బ్యాటుతో బంతి తాకడానికి ముందు ఫీల్డర్ ఇలా స్థానం మార్చుకోవడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ క్యాచ్ వివాదాస్పదమైంది. అంపైర్లు కూడా వెంటనే ఔటివ్వలేదు. ఐతే బంతి వేయడానికి ముందే బ్యాట్స్ మెన్ ఓ షాట్ ఆడటానికి సిద్ధమైనప్పుడు.. ఫీల్డర్ దాన్ని ముందుగానే అంచనా వేసి తన స్థానం మార్చుకోవచ్చని ఇటీవలే ఐసీసీ నిబంధనల్ని సవరించినట్లు తేలింది. దీంతో ఈ విషయమై అంపైర్లు కొద్దిసేపటివరకు చర్చించుకుని ఆలమ్ ఔట్ అని ప్రకటించారు. మ్యాచ్ అనంతరం దీనిపై ఐసీసీ వివరణ ఇచ్చుకుంది కూడా! క్రికెట్ నియమావళిని రూపొందించే ఎంసీసీతో సంప్రదించి.. ఈ క్యాచ్ సరైనదేనని తేల్చింది. దీంతో ఈ వివాదం అక్కడితో ముగిసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles