India vs west indies oneday match series

india vs west indies, indian cricket team, india cricket players, west indies cricket players, oneday matches, india oneday matches, mahendra singh dhoni, suresh raina, ambati rayudu, virat kohli

india vs west indies oneday match series

సొంతగడ్డపై తలలు దించుకుంటారా..? దించుకుంటారా..?

Posted: 10/11/2014 03:02 PM IST
India vs west indies oneday match series

తొలివన్డే నేపథ్యంలో వెస్టిండీస్ జట్టుతో ఘోరంగా పరాజయం చవిచూసిన టీమిండియా జట్టుపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరూ ఊహించని విధంగా సొంతగడ్డమీదే ఏకంగా 124 పరుగులతో భారత్ ఓడిపోవడంతో అటు అభిమానులతోపాటు టీమిండియా జట్టు కూడా పెద్ద షాక్ కే గురయ్యింది. వెస్టిండీస్ జట్టులో అంతగా సీనియర్ ప్లేయర్లు ఎవ్వరు లేకపోయినా ఆల్ రౌండర్ గా ప్రదర్శించి... భారత్ ను చిత్తుచిత్తుగా ఓడించేసింది. భారత్ లో బౌలింగ్ - బ్యాటింగ్ విభాగాల్లో అద్భుతమైన ప్లేయర్లు వున్నప్పటికీ.. విండీస్ ముందు తమ సత్తా చాటుకోలేక తోక ముడుచుకున్నారు. మొదటి వన్డే ఘోరంగా ఓడిపోవడం కారణంగా తదిపరి మ్యాచుల్లో టీమిండియా గెలుస్తుందనే నమ్మకాలు అస్సలు లేవని అభిమానులు పేర్కొంటున్నారు.

టీమిండియా గెలుపుపొందాలంటే అందుకు ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు. ముందుకు ఓపెనర్స్ ఇద్దరు ఆరంభాన్ని బాగా సద్వినియోగం చేసుకోగలిగితే.. తర్వాత వచ్చే మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు ఎక్కువ స్కోరును సాధించే అవకాశముంటుంది. అయితే భారత్ అలా కాకుండా మొదట్లోనే కుప్పకూలిపోవడం వల్ల మొదటి వన్డేను చేజేతులా వదులుకుంది. అలాకాకుండా ఓపెనర్లు కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే చాలాబాగుంటుందని అంటున్నారు. అలాగే గవాస్కర్ ఇచ్చిన సలహామేరకు కోహ్లీను మిడిల్ ఆర్డర్ లో ఆడిస్తే బాగుంటుందని అంటున్నారు. రైనా, రాయుడు, ధోనీలాంటి ఆటగాళ్లు నిలకడగా ఆడితే.. భారీ స్కోరును సాధించడంగానీ, ఛేధించడం గానీ కష్టమేం కాదంటున్నారు.

ఇకపై జరిగే వన్డే మ్యాచుల్లో టీమిండియాలో కొద్దిగా మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మోహిత్ దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో ఇషాంత్ లేదా ఉమేశ్ ను తీసుకునే ఛాన్స్ వుంది. ఇక స్పిన్నర్లలో కూడా మార్పులు జరగవచ్చు. ఏదేమైనా... ఈసారి టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణిస్తేనే ప్రత్యర్థిని ఓడించడానికి వీలుగా వుంటుందని అంటున్నారు. మరి ఈ మ్యాచ్ లో కూడా వెస్టిండీస్ తన సత్తా చాటుకుని భారత్ ను ఓడిస్తుందా..? లేదా..? భారత్ ఈసారి సొంతగడ్డపై విజయం సాధిస్తుందా..? లేదా..? అన్న సందేహాల్లో మునిగిపోయారు అభిమానులు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs west indies  oneday cricket matches  mahendra singh dhoni  virat kohli  

Other Articles