Indian cricket team loss the match against west indies in nehru stadium kochi

india cricket team, west indies cricket team, india vs west indies oneday series, mahendra singh dhoni, marlos samuels, suresh rain, ravindra jadeja, indian cricket team players

indian cricket team loss the match against west indies in nehru stadium kochi

సొంతగడ్డపైనే భారత్ కు చుక్కలు చూపించిన కరేబియన్స్!

Posted: 10/09/2014 01:11 PM IST
Indian cricket team loss the match against west indies in nehru stadium kochi

టీమిండియా క్రికెట్ జట్టు కేవలం ఇతర దేశాల్లోనే కాదు.. సొంతగడ్డపైనా ఇతర జట్ల చేతుల్లో ఘోరంగా విఫలమవుతారని తాజాగా నిరూపించేశారు. అప్పట్లో జరిగిన ఇంగ్లాండ్ టూర్ లో భారత్ టెస్టు మ్యాచుల్లో ఎంత దారుణంగా ఓటమి చవిచూసిందో అందరికీ తెలిసిందే! అలాగే ఈసారి వెస్టిండీస్ చేతిలో భారత్ సొంతగడ్డపైనే చిత్తుగా ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టులో మంచి ప్రతిభావంతులైన ఆటగాళ్లు లేరు.. బాగా ఎక్స్ పీరియన్స్ వున్న సీనియర్ ఆటగాళ్లు అస్సలు లేనేలేరు.. కానీ భారత్ లో మెరుపులు మెరిపించే ఆటగాళ్లు వున్నప్పటికీ వారి చేతుల్లో అత్యంత దారుణంగా పరాజయం పాలయ్యింది. సొంతగడ్డపైనే ప్రత్యర్థి జట్టుతో ఓడిపోయి మరోసారి ఇండియా గౌరవాన్ని మట్టికరిపించేశారు టీమిండియా ఆటగాళ్లు! కోచిలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది.

మొదట బ్యాటింగ్ కోసం బరిలోకి దిగిన వెస్టిండీస్.. 322 పరుగులు చేసి భారత్ ఫీల్డర్లను బాగానే పరుగులు పెట్టించారు. తొలుత చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించిన కరేబియన్ ఆటగాళ్లు.. రానురాను తమ వేగాన్ని పెంచుకుంటూ భారీ స్కోరువైపు దూసుకెళ్లారు. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఎవ్వరూ లేకపోయినప్పటికీ జూనియర్లు మాత్రం అద్భుతంగా తమ సత్తా చాటుకున్నారు. ఐపీఎల్ నేపథ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మార్లోస్ శ్యామ్యూల్.. అద్భుతంగా రాణించాడు. 116 బంతుల్లో 126 పరుగులు (11 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు శతకం చేస్తే... రామ్ దిన్ 59 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును జోడించడంలో ప్రముఖపాత్రను పోషించారు. దీంతో ఇన్నింగ్స్ మొత్తం పూర్తయ్యేలోపు వెస్టిండీస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 321 పరుగుల భారీ స్కోరును సాధించింది.

ఇక 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లు.. మొదట జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్తూ తమనుతాము నిలదొక్కుకోవడంలో సక్సెస్ అయ్యారు కానీ.. ఊహించని రీతిలో రహానే (24) ఔటయ్యాడు. ఇక ఇక్కడి నుంచి భారత్ ఆటగాళ్లు వరుసగా పవేలియన్ వైపు పరుగులు తీయడం మొదలుపెట్టారు. రహానే తర్వాత బరిలోకి దిగిన కోహ్లీ కేవలం 2 పరుగులే చేసి ఔటయ్యాడు. అయితే అతని తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు కాస్త కుదురుకున్నాడుకునేంతలోపే అనవసరంగా షాట్ కొట్టి ఔటయ్యాడు. ఇక సురేష్ రైనా ఒఖ్క పరుగుకూడా చేయకుండానే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనీ 8 పరుగులు చేసి బౌల్డయ్యాడు. అయితే ధావన్ మాత్రం అర్థసెంచరీ సాధించి, తన సత్తా చాటుకున్నాడు. అలాగే కొనసాగుతాడని భావించిన తరుణంలో శామ్యూల్స్ బౌలింగ్ లో బౌల్డ్ య్యాడు.  భువనేశ్వర కుమార్ (2), అమిత్ మిశ్రా (5), మోహిత్ శర్మ (8) ఇలావచ్చి అలా వెళ్లారు కానీ.. జడేజా 33 పరుగులు చేసి తమవంతు కీలకపాత్రను పోషించాడు. దీంతో 40 ఓవర్లలో టీమిడియా 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులకు ఆలౌట్ అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles