Young cricket player suryakumar yadav has played wonderfull innings kolkata knight riders enters semi finals

young cricket player suryakumar yadav, surya kumar yadav news, kolkata knight riders team, gautam gambhir team, robbin uthappa, yousuf pathan, champions cricket league

young cricket player suryakumar yadav has played wonderfull innings kolkata knight riders enters semi finals

‘‘సూర్య’’ ప్రతాపంతో సెమీస్ కు దూసుకెళ్లిన కోల్ కత!

Posted: 09/25/2014 01:53 PM IST
Young cricket player suryakumar yadav has played wonderfull innings kolkata knight riders enters semi finals

ఉప్పల్ స్టేడియంలో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్ లో అనుకోకుండా కొన్ని అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోల్ కత ఓడిపోవడం ఖాయమని భావించిన తరుణంలో యువసంచలనం సూర్య అద్భుతంగా ఆటను ప్రదర్శించి మలుపు తిప్పేశాడు. తనలో వున్న ప్రతాపాన్ని చూపిస్తూ.. అలవోకగా సిక్సర్లు బాదుతూ కోల్ కతకు సంచలన విజయాన్ని అందించాడు. జట్టులో గంభీరమైన ఆటగాళ్లు వున్నప్పటికీ అందురూ చేతులెత్తేయడంతో ఈ యువక్రికెటర్ తనలో వున్న సత్తాను నిరూపించి.. జట్టును సెమీ ఫైనల్ కు తీసుకెళ్లాడు.

మొదట బ్యాటింగ్ కు బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ జట్టు 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. అందులో వోగ్స్ ఆటగాడు ఒక్కడే అద్భుతమైన ఇన్నింగ్స్ కనబరిచాడు. 52 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) 71 పరుగులు సాధించాడు. ఇక 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కత జట్టు మొదట చాలానే తబడింది. కెప్టెన్ గంభీర్, కలిస్ ఆటగాళ్లు రెండో ఓవర్ లోనే నిష్ర్కమించడంతో జట్టు ప్రమాదంలో పడిపోయింది. క్రీజులోకి వచ్చిన ఉతప్ప, మనీష్ పాండే, మనీష్ పాండే, డస్కాటే లాంటి ఆటగాళ్లు కూడా అంతంత స్కోరు మాత్రమే నమోదు చేసి వెనుదిరిగారు. దీంతో మొత్తం 15వ ఓవర్లో కోల్ కత 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు మాత్రమే సాధించగలిగింది. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చేటప్పటికీ కోల్ కతా 35 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి వుంది.

సూర్య క్రీజులోకి వచ్చిరాగానే సిక్సర్లు బాదడం మొదలుపెట్టేశాడు. ఇతనిని చూసి చెలరేగిపోదామని అనుకున్న యూసుఫ్ పఠాన్ దెబ్బకు ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు చేయాల్సి వుండగా.. 19వ ఓవర్లో సూర్య రెండు సిక్సర్లు బాది జట్టును గాడిలో పడనీయకుండా కాపాడాడు. మిగిలిని చివరి ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేయాలి. అంతే.. కోల్ కత జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. కోల్ కతలో వున్న సీనియర్ ఆటగాళ్లు వెనుదిరిగినా.. సూర్య యాదవ్ ఏమాత్రం బెడియం లేకుండా జట్టును గెలిపించడంలో ప్రముఖపాత్రను పోషించాడు. దీంతో వరుసగా మూడువిజయాలతో 12 పాయింట్లు సాధించిన కోల్ కత.. సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suryakumar yadav  kolkata knight riders  champions cricket league  

Other Articles