Indian women cricket team won the match against england

indian cricket team, indian women cricket team, indian cricket male team, mahendra singh dhoni, captain mithali raj, england tour, indian teams in england tour, dhoni team, mithali raj team, indian women cricket team won match

Indian women cricket team won the match against england : Indian women cricket team won the match in england tour against england cricket team. In this match captain mithali has done a great job by doing 50 runs which helps to win the game

ధోనీ సేనకు మంచి గుణపాఠం నేర్పించిన భారతీయ మహిళలు

Posted: 08/16/2014 06:25 PM IST
Indian women cricket team won the match against england

(Image source from: Indian women cricket team won the match against england)

మహేంద్రసింగ్ ధోనీ.. మన భారతీయ క్రికెట్ జట్టుకు లభించిన ఒక అరుదైన కెప్టెన్. ఈయన సారధ్యంలోనే మనకు 28 సంవత్సరాల తరువాత ప్రపంచ కప్ లభించింది. మొదటి ట్వంటీ20 వరల్డ్ కప్ కూడా ఈయన కెప్టెన్ షిప్ లోనే దొరికింది. ప్రపంచవ్యాప్తంగా వున్న కెప్టెన్ లలో సింప్లిసిటీ - కూల్ కెప్టెన్ గా పేరు సంపాదించిన ఏకైకీ మహేంద్రుడు. ఎంతటి లక్ష్యాన్నైనా సరే.. చాలా సింపుల్ గా ముగించేయగలిగే ఏకైకా బ్యాట్స్ మెన్! ప్రపంచంలోనే ధోనీ తనదైన ముద్ర వేసుకున్న కెప్టెన్! కానీ ఇప్పుడు మాత్రం ఆ క్రెడిట్ లేవి ఈయనకు తోడునివ్వడంలో లేదు. ఎన్నడూలేని విధంగా దారుణంగా వరుసగా ఓటమి పాలవ్వడంతో అన్నివైపులనుంచి ఈయనకు కేవలం విమర్శలు మాత్రమే మిగులుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు సలామ్ కొట్టిన ధోనీకి.. ఇప్పుడు మాత్రం చీవాట్లు పెడుతున్నారు. దానికి ముఖ్యకారణం.. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో దారుణంగా విఫలమవడమేనని తెలుస్తోంది.

మొదటి మ్యాచ్ లో అంతంతా మాత్రమే రాణించిన ధోనీ సేన.. రెండో మ్యాచ్ లో అద్భుతంగా ప్రదర్శించి 28సంవత్సరాల ముందు వున్న చరిత్రను మళ్లీ తిరగరాసింది. కానీ ఆ తర్వాత ఘోరంగా విఫలమవుతూ చివరకు సీరిస్ ను చేజార్చుకునే పరిస్థితికి వచ్చేసింది. వరుసగా రెండు మ్యాచుల్లోనూ చాలా చెత్తగా ప్రదర్శించి, ఘోరంగా విఫలమయ్యింది. దీంతో ధోనీ సేకు మన భారతప్రజలు తిట్టరాని తిట్లతో ఎడాపెడా వాయించేస్తున్నారు. ఎవ్వరూ నోరువిప్పిన ధోనీ ఇక కెప్టెన్ గా పనికిరాడంటూ అంటున్నారు. ధోనీసేన ముందుకంటే చాలా చెత్తగా మారిపోయిందంటూ విమర్శలు జల్లులు కురిపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మన భారతీయ మహిళలు వారికి జబ్బలు వాయించేలా మంచి గుణపాఠం నేర్పించారు.

ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టుతోపాటు మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్ టూర్ లో వున్న సంగతి తెలిసిందే! ఈ టూర్ లో ధోనీ సేన ఏవిధంగా దారుణ ప్రదర్శనలతో పరాజయాలను మూటగట్టుకుందో మనందరికీ తెలిసిన విషయమే! అయితే మహిళల జట్టు మాత్రం ధోనీసేనకు మంచి గుణపాఠం నేర్పించేలా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో తొలి టెస్టులోనే ఇంగ్లాండ్ జట్టుపై 6 వికెట్ల తేడాతో అద్భుతంగా విజయం సాధించింది. దీంతో ధోనీసేనకు జబ్బలు వాయించేలా మన భారతీయ మహిళలు మంచి విజయాన్ని సాధించారని క్రికెట్ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కనీసం ఈ విజయంతోనైనా మన భారతదేశానికి మంచి గౌరవం లభించిందని అందరూ సంబరపడుతున్నారు.

వామ్ స్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో.. ఇంగ్లాండ్ మహిళలు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 92 పరుగులు మాత్రమే సాధించగా.. మన భారత మహిళలు 114 పరుగులు నమోదు చేసి, ఆధిక్యాన్ని సాధించారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 202 పరుగులు చేయగా.. భారత్ (మిథాలీ సేన) కేవలం 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు విజయలక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇందులో కెప్టెన్ మిథాలీ (50 నాటౌట్) రెండో ఇన్నింగ్స్ లో అజేయ అర్థసెంచరీ సాధించి.. జట్టును విజయబాటలో నడిపించడంలో కీలకపాత్ర వహిస్తే.. మిగతా ఆటగాళ్లు తమతమ అద్భుత ప్రదర్శనతో జట్టును ఆదుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles