South african cricketer jacques kallis announced retirement from international cricket

jacques kallis latest news, jacques kallis announced retirement from cricket, jacques kallis in south africa, south africa player jacqes kallis

South african cricketer Jacques Kallis announced retirement from international cricket

ఆల్ రౌండర్ ఆటగాడు ఆగిపోయాడు!

Posted: 07/31/2014 04:05 PM IST
South african cricketer jacques kallis announced retirement from international cricket

(Image source from: South african cricketer Jacques Kallis announced retirement from international cricket)

సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ప్రపంచ నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా పేరు సంపాదించుకున్న జాక్వస్ కలిస్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. గత సంవత్సరంలోనే టెస్ట్ క్రికెట్ సిరీస్ నుంచి వీడ్కోలు పలికిన ఈ ఆటగాడు.. తాజాగా క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా స్పష్టం చేశాడు. 38ఏళ్ల వయసున్న ఈ ఆటగాడు తన సౌతాఫ్రిక జట్టుకు అందించిన సేవలు ఎనలేనివని ప్రతిఒక్కరు కొనియాడుతున్నారు. ప్రపంచంలోనే క్రికెట్ రారాజుగా పేరొందిన జాక్వస్ కలిస్.. ఇక క్రికెట్ కు దూరమవుతున్నాడనే వార్తలు విన్న అతని అభిమానులు కూడా తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

కలిస్ తన రిటైర్ మెంట్ ను ప్రకటించగా.. దానిని దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లోర్గాట్ స్వాగతించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఆల్ రౌండర్ గా పేరొందిన కలిస్... సౌతాఫ్రికా జట్టుకు మరువలేని సేవలను అందించాడని ఆయన ప్రశంసించారు. తన జట్టు ఓటమి పాలవడం ఖాయమని భావించి కూర్చున్న తరుణంలో.. ‘‘నేనున్నానంటూ’’ తానొక్కడే విజయతీరాలకు చేర్చడంలో కలిస్ ఎన్నోసార్లు సఫలం అయ్యాడని, ఇటువంటి ఆటగాడిని కోల్పోతున్నందుకు ఎంతో బాధాకరమైన విషయమని ఆయన పేర్కొన్నాడు.

అలాగే ఇతని తోటి ఆటగాళ్లు అయిన కొంతమంది, సఫార్టీ టెస్టు - వన్డే జట్ల కెప్టెన్లు నీరాజనం పలికారు. కలిస్ లాంటి వ్యక్తి ఐదు దశాబ్దాలకు ఒకసారే పుడతాడని, నూటికి నూరుశాతం జట్టును గెలిపించడంలో ముందుండి ఆడే వ్యక్తి అని, యువతకు తానొక ఆదర్శప్రాయుడని టెస్టు జట్టు సారథి హషీమ్ ఆమ్లా పేర్కొన్నాడు. అదేవిధంగా.. డ్రెస్సింగ్ రూంలో కలిస్ లేకపోవడం చాలా పెద్ద లోటని.. ముఖ్యంగా అతని ట్రేడ్ మార్క్ స్లిప్ ఫీల్డింగ్ మిస్సవుతామని కూడా అతను విచారం వ్యక్తం చేశాడు. ఇక వన్డే జట్టు కెప్టెన్ ఏబీ డీవిలీర్స్ మాట్లాడుతూ.. కలిస్ వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ కు లేకపోవడం ఎంతో దురదృష్టకరమని పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles