Senior players forced virat kohli to take blessing with sachin

senior cricket players forced virat kohli to take blessing with sachin, virat kohli latest news, virat kohli comments on sachin tendulkar, sachin tendulkar latest news, virat kohli touching feets of sachin, virat kohli latest news

senior cricket players forced virat kohli to take blessing with sachin when he joins the team for the first time

సచిన్ కాళ్లకు మొక్కమని ఒత్తిడి చేశారు! విరాట్ కోహ్లీ

Posted: 07/23/2014 07:04 PM IST
Senior players forced virat kohli to take blessing with sachin

భారత్ యువక్రికెటర్ విరాట్ కోహ్లీ తన గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాల గురించి బహిర్గతం చేశాడు. తాను జట్టులోకి ఎంట్రీ అయిన అనంతరం సీనియర్ ఆటగాళ్లందరూ మొదట్లో తనకు తీవ్రం అసంతృప్తికి గురి చేశారని తన ఆవేదనను బయటపెట్టుకున్నాడు. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ కూడా వున్నా... ఆయన కూడా చూస్తూ ఊరికే వుండిపోయాడని... అప్పుడు తాను ఎంతో బాధపడినట్టు పేర్కొన్నాడు.

ఒక కామెడీ ప్రోగ్రామ్ లో సందడి చేసిన విరాట్ కోహ్లీ తన సీనియర్ల గురించి ఈ విధంగా పేర్కొన్నాడు. కానీ ఆ తరువాత అసలు విషయాన్ని బయటపెట్టాడు. విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చిన కొత్తలో సీనియర్ ఆటగాళ్లందరూ క్రికెట్ దిగ్గజం సచిన్ కాళ్లు మొక్కాలని తీవ్ర ఒత్తిడికి గురి చేశారట! ప్రతిఒక్క ఆటగాడు తనను అలా చెప్పడంతో... నిజమేనని భావించిన అతను సచిన్ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కడానికి సిద్ధపడ్డాడట! అయితే అప్పుడు సచిన్ టెండూల్కర్ చిరునవ్వి నవ్వి... ‘‘నువ్వు నా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేదు. వీళ్లందరూ నిన్న ఆటపట్టించడానికి ఇలా చేశారు’’ అని చెప్పినట్లు కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles