నేడు భారత క్రికెట్ జట్టు కఠోర పరీక్షలో పాల్గొనబోతోంది. గతంలో వున్న గణాంకాలను తనదైన రీతిలో తిరిగరాసే సమయం ఆసన్నమైంది. భారత్ కు భూతంగా మారిన లార్డ్స్ మైదానంలో ఎటువంటి ప్రదర్శనను కనబరుస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత 28 సంవత్సరాల నుంచి ఈ పిచ్ లో భారత్ కు ఒక్క విజయం కూడా లభించలేదు. అటువంటిది ధోనీ సేన ఎటువంటి ప్రతిభను ప్రదర్శిస్తుందోనని, ఈ కఠోర పరీక్షలో భారత్ నెగ్గగలదా అంటూ ప్రతిఒక్కరు ఆందోళనల్లో మునిగిపోయారు.
భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య రెండో టెస్టు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే ప్రఖ్యాత మైదానంగా పేరు పొందిన లార్డ్స్ లో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ సాగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.25 నిముషాలకు ప్రారంభం అవుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత క్రికెటర్లు అద్భుతంగా ప్రదర్శించారు. కానీ వారు ఆ మ్యాచ్ ఆడింది జీవం లేని పిచ్ గ్రౌండ్ లో! నాటింగ్ హామ్ కు, లార్డ్స్ గ్రౌండ్ ల మధ్య చాలా వ్యత్యాసం వుంది. సీమర్లకు ఈ పిచ్ ఎంతో బాగా సహకరిస్తుంది. ఇటువంటి పిచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోవడం భారతీయ బ్యాట్స్ మెన్ కు ఒక పెను సవాలే అని చెప్పుకోవాలి.
2008-2014 మధ్యకాలంలోని గణాంకాల ప్రకారం... ఈ పిచ్ మీద పేసర్లు దాదాపు 165 వికెట్లు తీసుకున్నారు. స్పిన్నర్లు మాత్రం కేవలం 69 వికెట్లను మాత్రమే తీయగలిగారు. అంటే పేసర్లకు ఈ గ్రౌండ్ ఏ రేంజ్ లో సహకరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. భారత్ తరఫున ఐదుగురు పేస్ బౌలర్లు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో స్టువర్ట్ బిన్నీ గత మ్యాచ్ లో అద్భుతంగా ప్రదర్శించడం వల్ల ఇందులో కూడా బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఇక అశ్విన్, జడెజాల్లో ఎవరినో ఒకరినే తీసుకునే అవకాశం వుంది. ఇక ఇంగ్లాండ్ జట్టులో కూడా మంచి పేసర్లే వున్నారు.
మొదటి మ్యాచ్ లో అద్భుతంగా ప్రదర్శించిన భారత్.. ఇప్పుడు ఈ మ్యాచ్ ను కూడా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ జట్టులో వున్న బౌలర్లను సమయానుకూలంగా సరైన రీతిలో ఉయోగించుకుని ఆరంభించాలని యోచిస్తున్నారు. ఒకవైపు ధోనీ సేన అన్ని విధాలుగా బరిలోకి దిగుతుంటే.. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ మాత్రం సరైన ఫామ్ లో కనిపించడం లేదు. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే కుక్ పై వేటు పడే అవకాశాలు వున్నాయని బోర్డు మెంబర్లు పేర్కొంటున్నారు. ఏదేమైనా.. భారత జట్టు ఈ లార్డ్స్ మైదానంలో అద్భుతంగా ప్రదర్శించి, సరికొత్త రికార్డు సాధించాలని ఆశిద్దాం!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more