Rajasthan royals beat sunrisers hyderabad

Rajasthan Royals, Sunrisers Hyderabad, Rajasthan win by 4 wickets, Ajinkya Rahane,Stuart Binny, Shikhar Dhawan

Rajasthan Royals got off to a winning start, beating Sunrisers Hyderabad by four wickets in an Indian Premier League (IPL) match at the Sheikh.

సన్ రైజర్స్ కి తప్పని ఓటమి

Posted: 04/19/2014 10:28 AM IST
Rajasthan royals beat sunrisers hyderabad

గత ఐపీఎల్ సీజన్ లీగ్ మ్యాచ్ ల్లో అదరగొట్టిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఈసారి కూడా అదే ఊపులో ఆటను కొనసాగించాలని ఎంతో ఉత్సాహంతో కొత్త సీజన్ ని మొదలు పెట్టినా ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి పాలైంది.

గత సీజన్లో బ్యాటింగ్ లో అంతంత మాత్రంగా రాణిస్తూ 130 నుండి 140 పరుగల మధ్య స్కోరు మాత్రమే చేసిన సన్ రైజర్స్ బౌలింగ్ ప్రతిభతో ఆరు మ్యాచ్ ల్లో నెగ్గింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో 133 పరుగులు చేస్తే గత సీజన్ లాగే గెలుస్తుందని అనుకున్నారు. బౌలర్లు ప్రారంభంలో వికెట్లు తీసినా ఆ తర్వాత లయ తప్పారు. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ రహానే, స్టువర్ట్ బిన్నీలు బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు.

మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది, ధావన్ 34 బంతుల్లో 38, వార్నర్ 35 బంతుల్లో 32 పరుగులు చేయడానికి బాగా కష్టపడ్డారు. రాజస్థాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేక పోయారు.

స్వల్ప లక్ష్యాన్ని ఛేధించడానికి బరిలో దిగిన రాజస్థాన్ జట్టు టాప్ ఆర్డర్ ను సన్ రైజర్స్ బౌలర్లు పేక మేడల్లా కూల్చి కష్టాల్లోకి నెట్టినా, అజింక రహానె 23 బంతుత్లో 59, స్టువర్ట్ బిన్నీ 48 నాటౌట్ తోడటంతో లక్ష్యాన్ని ఛేదించారు.హైదరాబాదు బౌలర్లు స్టెయిన్ 2, ఇషాంత్1 , భువనేశ్వర్ 1 వికెట్లు తీశారు. మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రహానేకు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles