Ipl 7 mumbai indians vs kolkata knight riders

Mumbai Indians vs Kolkata Knight Riders

Mumbai Indians vs Kolkata Knight Riders

నేటి నుండి ఐపీఎల్ సమరానికి తెర

Posted: 04/16/2014 11:58 AM IST
Ipl 7 mumbai indians vs kolkata knight riders

పరిమిత ఓవర్లు... పరుగుల సునామీ... కళ్ళు చెదిరే బ్యాటింగ్, ఫీల్లింగ్, ఛీర్స్ లీడర్స్ చిందులు... ఇవే కాకుండా ఆ దేశం , ఈదేశం అని కాకుండా అన్ని దేశాల ఆటగాళ్ళు ఒక జట్టుగా ఏర్పడి ఆడే ఆట ఐపీఎల్ సీజన్ 7 నేటి నుండి ప్రారంభం కాబోతుంది. మన దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ లకు పూర్తి భద్రత ఇవ్వలేమని చెప్పడంతో ఈ పొట్టి క్రికెట్ మ్యాచ్ ల్ని ఎడారి దేశానికి తరలించారు.

మన దేశంలో విపరీతమైన క్రేజ్ ఉండే ఈ ఐపీఎల్ కి విదేశాల్లో ఏ మాత్రం ఆదరణ లభిస్తుంది. 2009లో ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ జరిగినప్పుడు పెద్దగా ప్రేక్షకులు లేరు. అలాంటిది యూఏఈలో మ్యాచ్ ల్ని ఎవరు చూస్తారు. ఐపీఎల్ నిర్వాహకుల ఆదాయానికి గండి పడినట్లే అనుకున్నరంతా.

కానీ యూఏఈలో ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించిన తరువాత అక్కడి అభిమానుల నుండి వచ్చిన రెస్పాన్స్, టిక్కెట్ల కోసం అభిమానులు ఎగబడిన తీరు చూసి తెగ ఆనంద పడ్డారు ఐపీఎల్ నిర్వాహకులు. గత సంవత్సరం ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలతో కళ తప్పి, ప్రేక్షకులు ఛీ కొట్టే పరిస్థితి తెచ్చుకున్న ఈ లీగ్ ఈసారి అలాంటి వాటికి తావులేకుండా, పరుగులతో ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిద్దాం.  తొలి మ్యాచ్ ముంబై, కోల్‌కతాల మధ్య పోరుతో  ఈ సీజన్ మొదలు కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles