Yuvraj singh house in chandigarh attacked by fans

Yuvraj Singh, India vs Sri Lanka, ICC World Twenty20, fans attacked yuvraj house,

Yuvraj Singh scored 11 off 21 balls in the ICC World Twenty20 final against Sri Lanka in Mirpur on Sunday. Yuvraj Singh house in Chandigarh attacked by fans.

యువీ ఇంటి పై ఫ్యాన్స్ దాడి

Posted: 04/07/2014 06:10 PM IST
Yuvraj singh house in chandigarh attacked by fans

ఓ ఆటగాన్ని అభిమానులు అభిమానిస్తే నెత్తిన పెట్టుకొని పూజిస్తారు.. ప్రశంసల మీద ప్రశంసలు కురిపిస్తారు. అదే ఆటగాడు ఎంతో కీలకమైన మ్యాచ్ లో విఫలం అయ్యి ఒక రకంగా ఓటమికి కారణం అయితే అభిమానించిన వారే  ఛీ కొడతారు... కావాలంటే దాడి చేస్తారు.

ఇఫ్పుడు అదే పరిస్థితి వచ్చింది స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ కి. తొలి టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువీ నిన్న జరిగిన టి20 వరల్డ్ కప్ ఓడిపోవడానికి కారకుడని భావించిన కొందరు చండీగడ్ లోని అతని ఇంటి పై రాళ్లదాడి చేశారు.

దాంతో ఆయన ఇంటి వద్ద ఆదివారం నుంచే భధ్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ దాడి సంఘటన పై యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ స్పందిస్తూ... మ్యాచ్ ఓడిపోడానికి నా కుమారుడు ఒక్కడే బాధ్యుడు కాడని, తమ ఇంటి పై జరిగిన దాడి హేయమైన చర్య అని పేర్కొన్నాడు.

విజయాలు సాధిస్తే కీర్తించే మీరే, విఫలం అయినప్పుడు అండగా నిలవాల్సిన మీరే ఇలా దాడులకు పాల్పటం అమానుషమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి నిన్నటి ఆటలో రాణించని ఆటగాళ్ళ ఇంటి పై దాడులు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles