Spinners shine again in india 7 wicket win over wi

India, West Indies, India vs West Indies, ICC World Twenty20 2014, India vs West Indies previewm, India 7-wicket win, inida win, ICC World T20.

Spinners shine again in India 7-wicket win over WI, India vs West Indies

ఇలాంటి ఆట తీరు అభిమానులు ఎప్పుడు చూడలేదు?

Posted: 03/24/2014 11:45 AM IST
Spinners shine again in india 7 wicket win over wi

బ్యాట్స్‌మెన్ హవాసాగే భారత జట్టులో కాస్త ఆశ్చర్యపరిచే విషయమే.. కానీ శుభసూచకం! అమిత్ మిశ్రా రూపంలో వరుసగా రెండోసారి బౌలర్‌కే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది! పాకిస్థాన్‌పై తరహాలోనే వెస్టిండీస్‌పైనా బౌలర్లదే పూర్తి ఆధిపత్యమైంది. భీకరమైన బ్యాటింగ్‌లైనప్ ఉన్న వెస్టిండీస్ జట్టు భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడింది. రైనా ఆన్నట్టుగా ఆ జట్టు బ్యాట్స్‌మెన్ స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు తెగ తంటాలు పడ్డారు. 

దీంతో ఒకదశలో ఆ జట్టు 90-100 మధ్య స్కోరుకే పరిమితమవ్వొచ్చనిపించింది. టాస్ మరోసారి కలిసొచ్చినవేళ కెప్టెన్ ధోనీ మరోసారి అమిత్ మిశ్రా (4-0-18-2), జడేజా (4-0-48-3), అశ్విన్ (4-0-24-1)ల ధాటికి వెస్టిండీస్ 7 వికెట్లకు 129 పరుగులే చేయగలిగింది. గేల్ చేసిన 34 పరుగులే ఆ జట్టులో అత్యధికం. లెండిల్ సిమన్స్ 27 పరుగులు చేశాడు. 

ఇక భారత్ తొలి ఓవర్లోనే ధవన్ (0) వికెట్ నష్టపోయినా, 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రోహిత్ (62 నాటౌట్; 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లీ (54; 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీలతో ఛేజింగ్‌ను ఈజీ చేశారు.

ఇద్దరూ రెండో వికెట్‌కు 106 పరుగులు జోడించడం విశేషం. అయితే కోహ్లీ ఔటయ్యాక భారత్ విజయంపై కాస్త ఉత్కంఠ నెలకొంది. యువరాజ్ (10; 19 బంతుల్లో ఒకఫోర్) మందకొడి బ్యాటింగ్‌తో మ్యాచ్ ఆఖరు ఓవర్‌కు దారితీసింది. ఆఖరు ఓవర్లో విజయానికి ఒక పరుగే అవసరమైంది. 

శామ్యూల్స్ వేసిన ఆ ఓవర్లో తొలి రెండు బంతుల్ని డిఫెన్స్ ఆడిన యువీ, మూడో బంతికి ఔటయ్యాడు. అయితే క్రీజులోకొచ్చిన రైనా ఒత్తిడికి గురవ్వలేదు. తానెదుర్కొన్న తొలి బంతినే పాయింట్ దిశగా సింగిల్ తీశాడు. మరో రెండు బంతులు మిగిలిన దశలో భారత్ ఛేజింగ్‌ను పూర్తిచేసినా, ఈ మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం సాధించిన తీరు ఇటీవల కాలంలో అభిమానుపూన్నడూ చూసి ఎరుగరు. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles