Ravichandran ashwin comments

ravichandran ashwin, ashwin,teamindia, ravichandran ashwin comments, Indian cricket team.

ravichandran ashwin comments

నేను ఎవరికి సమాధానం చెప్పావల్సిన అవసరం లేదు?

Posted: 03/21/2014 03:06 PM IST
Ravichandran ashwin comments

మేం చాలా ప్రాక్టీస్ సెషన్లకు వెళుతున్నాం. వెళ్లిన ప్రతిసారీ ఓ కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. లేకపోతే బోర్ కొడుతుంది. మ్యాచ్‌లో ఓ నిర్ధిష్ట స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి బంతులు వేయాలనే అంశంపై ప్రయోగాలు చేస్తాను. వాటినే ఆచరణలో పెడతాను. దీనివల్ల నాపై విమర్శలు వస్తాయి. కానీ వాటికి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు. నాకు నేను సమాధానం చెప్పుకుంటే చాలని అంటున్నారు రవిచంద్రన్ అశ్విన్. 

రవిచంద్రన్ అశ్విన్... తన స్పిన్ బౌలింగ్‌తో, క్యారమ్ బంతులతో ఎంత వేగంగా పేరు సంపాదించాడో... అంతే వేగంగా విమర్శకులనూ పెంచుకున్నాడు. వరుస వైఫల్యాలు, బౌలింగ్ యాక్షన్‌లో మార్పు... ఇలా ఇటీవల కాలంలో తనపై ఒత్తిడి బాగా పెరిగింది. 

అయితే తానెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు ఈ ఆఫ్ స్పిన్నర్. ఏం చేస్తే తన బౌలింగ్ మెరుగుపడుతుందో తెలుసని చెబుతున్నాడు. తనకు తాను సమాధానం చెప్పుకుంటే చాలని, విమర్శకుల కోసం తాను ఆడటం లేదని అంటున్న అశ్విన్ అంటున్నారు. అయితే  ఉపఖండంలో ఎక్కడ క్రికెట్ ఆడినా స్పిన్నర్లు కీలకం కావడం సహజం. 

ఈసారి బంగ్లాదేశ్ వికెట్లపై స్పిన్నర్ల రాణింపే కీలకం. దీనికి మేం సన్నద్ధంగా ఉన్నాం. ధోని చెప్పినట్లు ఐపీఎల్ రూపంలో మేం కావలసినంత క్రికెట్ ఆడాం. కాబట్టి పేసర్లకూ అనుభవం ఉంది. ఐపీఎల్ వేరు, ప్రపంచకప్ వేరు.

కానీ ప్రపంచవ్యాప్తంగా టి 20 ఎక్కడ ఆడినా, ఆ అనుభవం ఉపయోగపడుతుంది. మూడు ఫార్మాట్లలో ఆడటం ఎవరికైనా సవాలే. బ్యాట్స్‌మెన్ ఫార్మాట్‌కు తగ్గట్లుగా ఆట మార్చుకుంటున్నారు.

కాబట్టి బౌలర్లు కూడా దీనికి అనుగుణంగా శైలి మార్చుకోవాలి. మేం ఏం చేయాలనేది చాలామంది నిపుణులు చెబుతూ ఉంటారు. నా వరకైతే వాటిని వింటూ కూర్చోవడం కంటే మైదానంలోకి వెళ్లి కొత్త పద్దతులను ప్రాక్టీస్ చేయడం మంచిదని భావిస్తాను.

అలా చేయడం వల్ల కొత్త శైలిలో బౌలింగ్, కొత్త రకాల బంతులు ఇలా అన్నీ అభివృద్ధి చేసుకోవచ్చు. దీనివల్ల ఫార్మాట్‌కు తగ్గట్లుగా బౌలింగ్ శైలిని మార్చుకోగలుగుతున్నని రవిచంద్రన్ అశ్విన్ అంటున్నారు. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles