Unfair to blame fletcher for teams failure gautam gambhir

Gautam Gambhir, Cricketer Gautam Gambhir, Gautam Gambhir intereview in New Delhi.

Unfair to blame Fletcher for teams failure-Gautam Gambhir

క్రికెట్ అనేది నేను చూడను : గంభీర్

Posted: 03/20/2014 10:00 AM IST
Unfair to blame fletcher for teams failure gautam gambhir

ఒకప్పుడు భారత బ్యాటింగ్‌కు వెన్నుదన్నుగా భావిస్తూ వచ్చిన గౌతమ్ గంభీర్ నిలకడ లేని ఫామ్ కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ జట్టులో తిరిగి స్థానం సంపాదించాలన్న కృతనిశ్చయంతో ఉన్న ఒకప్పటి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ తిరిగి జట్టులోకి రావడానికి ఇండియన్ ప్రీమియం లీగ్(ఐపిఎల్)ను ఉపయోగించుకోవడంకన్నా ఎక్కువ కాలం దేశవాళీ క్రికెట్‌లో ఆడడానికి ఇష్టపడతానని చెప్పారు.  

అయితే అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడంపై ఆశలు కోల్పోని గంభీర్ దేవ్‌ధర్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున, ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున చక్కటి ప్రతిభను ప్రదర్శిస్తే చాలని అనుకుంటున్నానని చెప్పాడు. ‘జాతీయ జట్టులోకి రావడానికి ఐపిఎల్‌ను ఒక ప్లాట్‌ఫామ్‌గా నేను ఎప్పుడూ ఉపయోగించుకోను. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున రాణించడానికి మాత్రమే ఐపిఎల్‌ను ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుంటాను. 

కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున చక్కగా రాణించడం నాకు ముఖ్యం. అయితే జాతీయ జట్టులోకి తిరిగి రావడం కోసం నేను ఐపిఎల్‌లో ఆడను. నా జట్టుతరఫున వారి కోసం చక్కగా ఆడడం కోసం మాత్రమే నేను ఐపిఎల్ ఆడతాను అంతే’ అని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ చెప్పాడు. 

‘జాతీయ జట్టులోకి రావడానికి డొమెస్టిక్ క్రికెటే తొలిమెట్టు. క్రికెట్‌పై ప్రేమ ఉన్నంతవరకు డొమెస్టిక్, ఐపిఎల్, అంతర్జాతీయ క్రికెట్ అనేది నేను చూడను.. ఏ వేదికపైనైనా ఆడతాను. నేను క్రికెట్‌ను ప్రేమిస్తాను. అదే నాకు ముఖ్యం’ అని బుధవారం ఇక్కడ వెన్నుముక పరిశోధనకు నిధులను సేకరించడం కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గంభీర్ చెప్పారు.

2013 జనవరిలో ధర్మశాలలో ఇంగ్లండ్‌పై వన్‌డే మ్యాచ్ ఆడిన తర్వాత 31 ఏళ్ల గంభీర్ టీమిండియా తరఫున ఆడి ఏడాదికి పైగానే అయింది. టెస్టు క్రికెట్, టి-20లను కూడా లెక్కలోకి తీసుకుంటే గంభీర్ జాతీయ జట్టు తరఫున ఆడి 15 నెలలకు పైగానే అయింది.  

అయితే వచ్చే జూన్‌లో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనుండడం, ఆ తర్వాత ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లో ప్రపంచ కప్ జరగనుండడంతో గంభీర్‌కు మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చే అవకావాలు పూర్తిగా మూసుకుపోలేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి మాత్రం తాను దేశవాళీ టోర్నమెంట్లపైనే ఎక్కువ ద్రుష్టి పెట్టానని గంభీర్ చెప్తున్నాడు.

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles