New zealand india 3rd odi tie

Third ODI tie, India Vs New Zealand, Mahendra Singh Dhoni, Ross Taylor, Corey Anderson, Live Cricket score, Ravindra Jadeja,

The third ODI between India and New Zealand ended in a sensational tie after Ravindra Jadeja managed to slam 17 runs off the final over.

మూడే వన్డేను ఎటూ తేల్చలేక పోయారు

Posted: 01/25/2014 05:10 PM IST
New zealand india 3rd odi tie

న్యూజిలాండ్ తో నేడు జరిగిన మూడో వన్డేలో భారత జట్టుకు ‘చావు తప్పి కన్ను లొట్టపోయింది’చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో సిరీస్ పై ఆశలు కోల్పోకుండా నిలుపుకుంది. ఉత్కంఠ బరితంగా సాగిన ఈ వన్డేలో చివరి వరకు పోరాడి అతి కష్టం మీద టై చేసింది. 315 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 314 మాత్రమే చేయగలిగింది.

భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(39), శిఖర్ ధావన్(28) తొలి వికెట్ కి 64 పరుగులతో మంచి శుభారంబాన్ని ఇచ్చారు. కానీ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ కోహ్లీ, రహానే వెంటవెంటనే వికెట్లు కోల్పోవడం భారత్ కష్టాల్లో పడింది. తరువాత వచ్చిన సురేష్ రైనా (31) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ధోని (50), రవిచంద్రన్ అశ్విన్ (65) పరుగులు చేసి మిడిల్ ఆర్డర్ లో రాణించినా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో మళ్ళీ కష్టాల్లో పడింది.

చివర్లో రవీంద్ర జడేజా విజయతీరాలకు తీర్చడానికి ఒంటరి పోరాటం (66) పరుగులు చేసినా ఫలితం తేల్చలేక పోయాడు. అంతకు ముందు భారత ఫేస్ విభాగం పై కివీస్ బ్యాట్స్ మెన్స్ విరుచుకు పడ్డారు. నేటి జట్టులోకి వరుణ్ అరోన్ ని తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు.

న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్ (111) తో రాణించాడు. అతనికి తోడు విలియమ్పస్ (65) కూడా తోడవ్వడంతో కివీస్ 314 భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో అండర్సన్ అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్ లో కివీస్ 2-0 తో ముందంజలో ఉంది. నాల్గొ వన్డే 28న హమిల్టన్ లో జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles