Bcci committee visits vizag cricket stadium

BCCI, IPL, YSR Reddy ACA-VDCA Cricket Stadium, Ranjit Biswal, M V Sridhar, Cricket News, Vizag Cricket stadium

A BCCI panel headed by Ranjit Biswal today inspected the YSR Reddy ACA-VDCA Cricket Stadium here to accord Test status accreditation to the venue

టెస్టుకు వైజాగ్ స్టేడియం అన్ని విధాల ఓకె

Posted: 01/10/2014 11:06 AM IST
Bcci committee visits vizag cricket stadium

ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చిన విశాఖ క్రికెట్ స్టేడియానికి త్వరలో ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ లకే పరిమితం అయిన ఈ స్డేడియం ఇక టెస్టులకు కూడా ఆతిథ్య ఇవ్వడానికి అన్ని విధాల సరిపోతుందని ఈ స్టేడియాన్ని పరిశీలించిన బీసీసీఐ నియంత్రణ మండలి ప్రతినిధి బృందం తేల్చి చెప్పింది.

విశాఖ స్టేడియాన్ని వచ్చిన బీసీసీఐ పరిశీలన కమిటీ కన్వీనర్, ఐపీఎల్ చైర్మన్ అయిన రంజీబ్ బిస్వాల్ నేత్రుత్వంలో అవుట్ ఫీల్డ్, ప్రాక్టీస్ గ్రౌండ్స్, ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లను పరిశీలించింది. ఐపీఎల్-7లో కొన్ని మ్యాచ్‌లు వైజాగ్‌లో నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు బిస్వాల్ చెప్పారు.  త్వరలో మా నివేదికను బోర్డుకు సమర్పిస్తాం.

అవకాశాన్ని బట్టి ఐపీఎల్‌కు వైజాగ్‌ను కూడా ఒక వేదికగా ఎంచుకుంటామనిచెప్పారు. వీరు ఇచ్చిన నివేదికకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే... వైజాగ్ స్టేడియానికి మంచి రోజులు వచ్చినట్లేనని అక్కడి క్రికెట్ అబిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles