India beat pakistan to lift u 19 asia cup

Vijay Zol,under-19 World Cup, Under-19 Asia Cup, Sanju Samson, India vs Pakistan final, India beat Pakistan

Asia Cup in Sharjah on Sunday, beating arch-rivals Pakistan by 40 runs in a thrilling final.

అండర్ 19 ఆసియా కప్ మనదే

Posted: 01/05/2014 01:10 PM IST
India beat pakistan to lift u 19 asia cup

షార్జాలో జరిగిన అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో భారత కుర్రాళ్ళు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ పై గెలిచి టైటిల్ సొంతం చేసుకోడమే కాకుండా లీగ్ దశలో ఓడిన దానికి ప్రతీకారం తీర్చుకున్నారు. టైటిల్ పోరులో భాగంగా జరిగిన ఫైనల్స్ లో భారత్ దాయాది పాక్ పై 40 పరుగుల తేడాతో తిరుగులేని విజయం సాధించారు.

భారత జట్టు కుర్రాళ్ళలో భవిష్యత్తు ఆశాకిరణాల్లా కనిపిస్తున్న విజయ్ జోల్, సంజు శాంసన్ సెంచరీల ధాటికి పాకిస్థాన్ జట్టు పరాజయం పాలవ్వక తప్పలేదు.  తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కేరళ తాజా యువసంచలనం సంజు శాంసన్ (100) , కెప్టెన్ విజయ్ జోల్ (100) శతకాలతో అదరగొట్టడంతో టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లరో ఎనిమిది వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు చేసింది.

భారీ లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన పాకిస్థాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 274 పరుగులు మాత్రమే చేసింది. కమ్రాన్ గులామ్ 102,  సమి అస్లామ్ 87 పరుగులు చేసినా జట్టుకు విజయాన్ని అందించలేక పోయారు. భారత భౌలర్లలో కుల్ దీప్ యాదవ్ మూడు వికెట్లు, మిలింద్, హుడా, గని రెండేసి వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ కప్ లో జోల్, సంజు శాంసన్ జాతీయ సెలక్టర్ల మనస్సులో స్థానం సంపాదించారు. అతి త్వరలోనే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles