India vs south africa 1st odi in johannesburg

India Vs South Africa 1st ODI, team india, south africa, india tour of south africa 2013 14, ms dhoni, shikhar dhawan, rohit sharma, virat kohli

India Vs South Africa 1st ODI in Johannesburg, team india, south africa, india tour of south africa 2013-14

తొలి పోరుకు సిద్దమైన ఇరుజట్లు

Posted: 12/05/2013 12:39 PM IST
India vs south africa 1st odi in johannesburg

స్వదేశంలో భారత క్రికెట్ జట్టు పులే. కానీ విదేశీ గడ్డ పై మాత్రం పిల్లి. ప్రపంచ అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతున్న భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. గత మూడు సంవత్సరాల క్రితం అనుభవం ఉన్న ఆటగాళ్ళతో వెళ్లి ఒక్కటి అంటే ఒక్క సిరీస్ కాదు కదా మ్యాచ్ కూడా గెలవకుండా ఘోర పరాజయం పాలై తిరిగి వచ్చింది. మళ్లీ ఇప్పుడు ఏ మాత్రం విదేశీ పిచ్ ల పై అనుభవం లేని జట్టుతో వెళ్లిన కుర్ర జట్టు దక్షిణాఫ్రికా పిచ్ లను తట్టుకుంటుందా అనేది ప్రశ్న.

గత సిరీస్ లో ఓడిన ఇండియా ఉద్రేకాల మధ్య సిరీస్‌కు సిద్ధం అయింది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్ రూపంలో తొలి పరీక్షను ఎదుర్కోబోతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ఇక్కడి వాండరర్స్ మైదానంలో తొలి మ్యాచ్ జరగనుంది.  సొంతగడ్డపై ఇటీవల పాక్ చేతిలో సిరీస్ ఓడిన దక్షిణాఫ్రికా మళ్లీ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఇటీవలి ప్రదర్శన ప్రకారం చూస్తే భారత్ అభేద్యంగా కనిపిస్తున్నా... ఉప ఖండానికి భిన్నమైన పరిస్థితులు ఉండే సఫారీ గడ్డపై ఏ స్థాయి ఆటతీరు కనబరుస్తుందనేది ఆసక్తికరం. దక్షిణాఫ్రికాలో భారత జట్టు గత రికార్డు పేలవంగా ఉండటం ప్రతికూలాంశం. ఆ జట్టుతో ఇక్కడ జరిగిన 25 వన్డేల్లో టీమిండియా 5 మాత్రమే నెగ్గి 19 ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక్కడ మన జట్టు ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా గెలవలేకపోయింది. మరి ఈసారైనా గెలుస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles