Halep notches first career win over Sharapova in Beijing చైనా ఓపెన్ నుంచి షరపోవా ఔట్..

China open simona halep seals landmark win over maria sharapova

simona halep, maria sharapova, china open, sports news, tennis, china open super series 2017, india tennis, tennis news, Tennis, sports news, latest Tennis news, latest sports news

Maria Sharapova was emphatically dumped out of the China Open in the third round on Wednesday by Simona Halep, going down 6-2, 6-2 to Romania's world number two.

చైనా ఓపెన్ నుంచి షరపోవా ఔట్..

Posted: 10/04/2017 07:05 PM IST
China open simona halep seals landmark win over maria sharapova

చైనా ఓపెన్ లో రష్యా టెన్నిస్ క్వీన్, మాజీ నెంబర్ వన్ మరియా షరపోవాకు చుక్కెదురైంది. డోపింగ్ ఆరోపణలతో 15 నెలల నిషేధం తర్వాత ఆడిన ప్రతి టోర్నమెంట్లో ఏదో ఓ దశలో ఇంటిబాట పడుతున్న షరపోవా.. తాజాగా చైనా ఓపెన్ మూడో రౌండ్లో ఓటమి పాలైంది. రొమేనియా భామ, వరల్డ్ నెంబర్ 2 సిమోనా హలెప్ చేతిలో 6-2, 6-2తో రెండు వరుస సెట్లు కోల్పోయిన షరపోవా చైనా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. వరుస సెట్లలో షరపోవాకు ముచ్చెమటలు పట్టించిన హలెప్ ఈ విజయంతో గతంలో ఎదురైన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంది.

డోపింగ్ నిషేధం తర్వాత గత ఏప్రిల్ లో మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టిన రష్యన్ టెన్సిస్ క్వీన్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది. బీజింగ్ లోని హార్డుకోర్టులోనూ రాణించలేకపోవడంతో హలెప్ చేతిలో చిత్తయింది. ఇటీవల యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో నాలుగో రౌండ్‌లో లాత్వియాకు చెందిన అనస్తాసిజా సెవస్తోవా చేతిలో 5-7, 6-4, 6-2 తేడాతో షరపోవా ఓటమిపాలైంది.

మునుపటిలా గ్రాండ్ స్లామ్ లు, భారీ టోర్నీలు నెగ్గాలంటే షరపోవా అంతకుమించి శ్రమించాల్సి ఉంటుందని టెన్నిస్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వరల్డ్ నెంబర్ వన్ ముగురుజా టోర్నీ నుంచి ఇదివరకే తప్పుకోవడంతో, చైనా ఓపెన్ లో హలెప్ అవకాశాలు మెరుగయ్యాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : simona halep  maria sharapova  china open  sports news  tennis  

Other Articles