Leander Paes not late to Rio 2016 Olympics, quashes allegations

Leander paes not assigned room in rio olympic games village

leander paes, paes, rohan bopanna, bopanna, paes bopanna, paes olympics, paes rio late, rio 2016 olympics, rio olympics tennis, olympics tennis, tennis india, tennis news, tennis

Leander Paes has rubbished reports that said he has arrived late to Rio 2016 Olympics and wishes not to room with Rohan Bopanna.

రియో ఒలంపిక్స్ విలేజ్ లో లియాండర్ పేస్ కు పరాభవం..

Posted: 08/05/2016 07:56 PM IST
Leander paes not assigned room in rio olympic games village

భారత లెజండరీ టెన్నీస్ ఆటగాడు లియాండర్ పేస్‌కు ఘోర అవమానం జరిగింది. ఒలింపిక్స్-2016లో పాల్గొనేందుకు గురువారమే బ్రెజిల్ రాజధాని రియో చేరుకున్న లియాండర్‌కు రూమ్ కేటాయించలేదు. దీంతో వేరే ఆటగాడితో కలిసి రూమ్ షేర్ చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నాడు. దీంతో పేస్ మనస్థాపానికి గురయ్యాడు. ఆరుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న తనకు రూమ్ కేటాయించకపోవడం ఎంతో బాధగా ఉందని పేస్ వ్యాఖ్యానించాడు. అయితే తాను న్యూయార్క్‌లో వరల్డ్ టెన్నీస్ టోర్నీలో పాల్గొనడం వల్లనే మిగతా వాళ్లతో కలిసి రాలేకపోయానని వివరించాడు. మొత్తం మూడు గదులు కేటాయించారని, ఒక దానిలో కోచ్ జిఫాన్ అలీ, మిగితా వాటిలో మరో టెన్నీస్ ప్లేయర్ రోహన్ బోపన్న, ఫిజియోథెరపిస్టు ఉన్నారని చెప్పాడు పేస్. దీంతో పేస్ రాకేశ్ గుప్తా గదిని వాడుకుంటున్నాడు.

అయితే తాను రోహన్ బోపన్నతో కలిసి ఉండటానికి ఇష్టపడలేదని వస్తున్న వార్తల్లో నిజంలేదని తెలిపాడు. కోచ్ అలీ పేస్‌కు మద్దతుగా నలిచారు. భారతీయులకు రియోలో ఈ తరహా అవమానమే రెండు రోజుల క్రితం జరిగింది. హాకీ ఆటగాళ్లకు కుర్చీలు, టీవీ సెట్లు సరిపడా లేక ఇబ్బంది పడ్డారు. దీంతో ఛీఫ్ కోచ్ ఓల్టమన్స్ ఫర్యాదు కూడా చేశారు. ఒలింపిక్ గ్రామంలో ఇలాంటి ఫిర్యాదులు భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, మరికొన్ని దేశాలు కూడా చేసాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉంటున్న బిల్డింగ్ బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో దాన్ని ఖాళీ చేసి ఇబ్బంది పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : leander paes  rohan bopanna  rio 2016 olympics  tennis  

Other Articles